మినిస్టర్ నంబర్ వన్..పెమ్మసాని

 

దేశ రాజకీయాలకు తెలుగు తరం, పనితనాన్ని పరిచయం చేస్తున్నారు ఓ యువ  ఎంపీ ....ఎంపీ గా మాత్రమే కాదు కేంద్ర సహాయ మంత్రిగా తన పనితనాన్ని , యావత్ భారతదేశానికి పరిచయం చేస్తున్నారు... దీంతో గల్లీ నుండి కాదు,  ఢిల్లీ నుంచి కూడా ఆ ఎంపీ కి ,ఆ కేంద్ర సహాయ మంత్రికి ప్రశంసలు వెల్లు వెత్తుతున్నాయి ...సాక్షాత్తు ప్రధానమంత్రి సైతం ఆ యువ కేంద్ర మంత్రి పనితనానికి అబ్బురపడుతున్నట్లు సమాచారం.... ఇంతకు ఎవరు, ఈ కార్యసాధకుడు,  ఎవరు తెలుగుతనాన్ని, తెలుగు జాతిఖ్యాతిని దేశ వ్యాప్తంగా  ఇనుమడింపజేస్తున్న ఉత్తమ కేంద్రమంత్రి..... మీరే చూడండి ...


కార్యసాధకుడు ....ఈ మాట , గుర్తుకు వస్తే గతంలో చాలామంది కనపడేవారు, ... కానీ ఇప్పటి తరంలో కార్యసాధకులు తగ్గిపోయారు ...కేవలం కబుర్లతో కాలక్షేపం చేసేవారు ఎక్కువయ్యారు... రాజకీయాల్లో అయితే ఇలా మాటలు చెప్పి పబ్బం గడుపుకునే  వ్యవహారం మరింత ఎక్కువైంది...  అలాంటి తరుణంలో కొత్తగా ఎన్నికైన ఓ ఎంపీ ,దేశం మొత్తం తన వైపు చూసేలా తన పని మొదలుపెట్టారు... రాజకీయాలలో కొత్తగా ఎంటర్ అయిన ఓ వ్యక్తి ,ఇప్పుడు దేశంలో కార్యసాధకుడిగా గుర్తింపు పొందుతున్నారు... ఆయనే గుంటూరు ఎంపీగా గెలిచి, కేంద్ర సహాయ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్..

ఒక ఎంపీ గానే కాదు కేంద్ర సహాయ మంత్రిగా తనపై ఉన్న బాధ్యతలను ఎప్పటికప్పుడు నిర్వర్తిస్తూనే దేశంలో అత్యంత ప్రతిభావంతమైన కేంద్ర సహాయ మంత్రిగా గుర్తింపు తెచ్చుకున్నారు పెమ్మసాని చంద్రశేఖర్ ..... తన ఉనికికి కావాల్సింది పదవి కాదు ,తన పనితీరే కొలమానంగా చెలరేగిపోతున్న  కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని,  ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలో ఇటీవల కేంద్ర మంత్రుల పనితీరు పై చేపట్టిన సమగ్ర సర్వేలో  నంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకున్నారు... జిల్లాకు చెందిన డాక్టర్ చంద్రశేఖర్ గతంలో ఉద్యోగరీత్యా, వ్యాపార రీత్యా, అమెరికాలో స్థిరపడిపోయారు ...కానీ సొంత ప్రాంతం పై ఉన్న మమకారంతో గుంటూరు ఎంపీగా పోటీ చేసి టిడిపి ఎంపీగా గెలిచారు... అలా మొట్టమొదటిసారి ఎంపీగా గెలిచిన చంద్రశేఖర్, అభివృద్ధిలో చెలరేగిపోతున్నారు.... అంతేకాదు కేంద్ర సహాయ మంత్రులు కాదు,  మొత్తం కేంద్ర మంత్రుల జాబితా లో సైతం ఆయన ఉత్తమ ఫలితాలు సాధించి , జాతీయస్థాయిలో 5వ స్థానంలో నిలిచారు ....తద్వారా తెలుగుజాతి ఖ్యాతిని ,ఢిల్లీలో మరొకసారి రెపరెపలాడించారు కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ...

 చంద్రశేఖర్ గుంటూరు ఎంపీగా గెలిచిన మొదటి రోజు నుండే,  ప్రజల మద్దతుతో, తనకు ఉన్న  చొరవతో ఎప్పటికప్పుడు అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్షలు చేస్తూనే ఉన్నారు ....ఒక్క మాటలో చెప్పాలంటే దేశంలో సహాయ మంత్రుల్లో, అధికారులతో ఇన్ని సమీక్షలు చేసిన మంత్రి ఎవరైనా ఉన్నారా అంటే  లేరని చెప్పవచ్చు.... ఢిల్లీ నుంచి గల్లీ వరకు, ఉన్న అధికారులతో, ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహించడం ,గుంటూరు అభివృద్ధికి, రాష్ట్ర అభివృద్ధికి ఏం కావాలో దగ్గరుండి చూసుకోవడం పెమ్మసాని పొలిటికల్ స్టైల్..... గుంటూరు ప్రభుత్వ హాస్పిటల్ అభివృద్ధి,  నుండి గుంటూరులో నూతన  రైల్వే ప్రాజెక్టులు,  అదేవిధంగా రైల్వే అండర్ బ్రిడ్జి లు , రైల్వే ఓవర్ బ్రిడ్జిలు  అంటూ కొత్త కొత్త ప్రాజెక్టులు తీసుకురావడం, తాగునీటి సమస్యలపై కేంద్ర సహకారం తీసుకురావడం వంటివి , పెమ్మసాని చంద్రశేఖర్  పనితీరుకు కొలమానంగా చెప్పుకోవచ్చు.... ఇలా ప్రతి దశలో  తన ప్రత్యేకతతో, గుంటూరులోనే కాదు,  ఢిల్లీలో సైతం కార్యసాధకుడిగా ముద్ర వేసుకున్నారు పెమ్మసాని ....

కేంద్ర సహాయ మంత్రుల ర్యాంకులు జాబితాలో నెంబర్వన్ స్థానం సంపాదించడం,  పెమ్మసాని వ్యక్తిగత విజయం మాత్రమే కాదు , తెలుగు ప్రజల వారధిగా ,సారధిగా ఢిల్లీలో తెలుగుజాతి ఖ్యాతిని నిలబెట్టిన మరో ప్రజా ప్రతినిధిగా  పెమ్మసాని పేరు చెబుతున్నారు గుంటూరు ప్రజలు......


 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu