బీసీ రిజర్వేషన్లపై ఢిల్లీలో నిరసనకు కేబినెట్ నిర్ణయం

 

బీసీలకు 42% రిజర్వేషన్లుపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం నుంచి  స్పందన కరవైన నేపథ్యంలో ఢిల్లీలో నిరసనలు చేపట్టాలని  కేబినేట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నామని మంత్రి పొన్న ప్రభాకర్‌ తెలిపారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు బీజేపీ నేతలు శాసనసభలో ఆమోదం తెలిపి.. ఢిల్లీలో అడ్డుకుంటున్నారని మంత్రి పొన్న  విమర్శించారు. 

బీసీలకు 42% రిజర్వేషన్లపై ఆర్డినెన్స్‌ను జూలై 14న గవర్నర్‌కు పంపాం. గవర్నర్ ఆమోదం కోసం ఎదురు చూస్తుమన్నారు. ఆగస్టు 5,6,7 తేదీల్లో రాష్ట్రపతి అపాయింట్‌ కోరామని చెప్పారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌ కోరేవారంతా తమతో కలిసి ఢిల్లీకి రావాలని మంత్రి పిలుపునిచ్చారు. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu