తెలంగాణకు నలుగురు కొత్త జడ్జిల నియామకం

 

తెలంగాణ హైకోర్టులో నలుగురు కొత్త జడ్జిల నియామకానికి కేంద్రం ఆమోదం తెలిపింది. సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసులను ఆమోదించింది. ఈ మేరకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము  ఉత్తర్వులు జారీ చేశారు. నూతన న్యాయమూర్తులుగా గౌస్‌ మీరా మొహియుద్దీన్‌, చలపతిరావు సుద్దాల అలియాస్‌ ఎస్‌.చలపతిరావు, వాకిటి రామకృష్ణా రెడ్డి, గడి ప్రవీణ్‌ కుమార్‌ ప్రమాణం చేయనున్నారు.

 దేశంలోని పలు హైకోర్టులకు 19మంది జడ్జిలు/అదనపు జడ్జిలు నియమితులయ్యారు. పలువురు న్యాయవాదులు, జ్యుడీషియల్‌ ఆఫీసర్లను జడ్జిలు/అదనపు జడ్జిలుగా నియమించేందుకు సుప్రీంకోర్టు కొలీజియం చేసిన సిఫారసుకు రాష్ట్రపతి ఆమోదముద్ర వేశారు. ఈ మేరకు కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్‌రామ్‌ మేఘ్వాల్‌ ప్రకటించారు. 

మొత్తం 19 మందిలో తెలంగాణ హైకోర్టుకు కొత్తగా నలుగురు అదనపు న్యాయమూర్తులు నియమితులయ్యారు. ఇటీవలే తెలంగాణ హైకోర్టుకు కొత్త ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్ నియమితులైన విషయం తెలిసిందే. ఆయన జులై 19వ తేదీన రాజ్‌భవన్‌లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సమక్షంలో దైవసాక్షిగా ప్రమాణ స్వీకారం చేశారు. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu