TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

హైదరాబాద్‌‌లో చిరుత సంచారం కలకలం

Published on: Mon Jul 28, 2025 6:21PM

 

హైదరాబాద్‌ నగరంలో చిరుత సంచారం కలకలం రేపింది. గోల్కొండ ప్రాంతంలో  ఇబ్రహీంబాగ్‌ మిలిటరీ ఏరియాలో రోడ్డు దాటుతున్న చిరుత దృశ్యాలు  సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. తారామతి వెనుకభాగం మీదుగా మూసీనది వైపు వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని గోల్కొండ పోలీసులు ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చారు.   ఇటీవల మంచిరేవుల, నార్సింగి ప్రాంతాల్లో  చిరుత సంచరిస్తోంది. గ్రేహౌండ్స్‌ ప్రాంతంలో 4 బోన్లు, ట్రాప్‌ కెమెరాలను అధికారులు ఏర్పాటు చేశారు. 

బోన్లకు చిక్కకుండా  తప్పించుకుని తిరుగుతోంది. ఈ క్రమంలోనే ఇబ్రహీంబాగ్‌ మిలిటరీ ప్రాంతంలో చిరుత రోడ్డుదాటినట్లు సమాచారం. ప్రస్తుతం చిరుత కోసం ఫారెస్ట్ అధికారులతో కలిసి పోలీసులు గాలిస్తున్నారు. స్థానికులు జాగ్రత్తగా ఉండాలని సూచనలు చేశారు. కాగా, ఇటీవలే నార్సింగి మున్సిపాలిటీ మంచిరేవుల విలేజ్ వ్యాస్ నగర్‌ క్యాంపస్‌లో చిరుత సంచారం వార్త కలకలం రేపిన విషయం తెలిసిందే.చిరుత సంచరించడం స్థానికులను తీవ్ర భయాందోళనకు గురిచేస్తోంది.