మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కు నోటీసులు
posted on Jul 24, 2025 11:29AM
.webp)
మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్‌కు పోలీస్ లు నోటీసులు జారీ చేశారు. తెలుగుదేశం ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి ఫిర్యాదు మేరకు అనిల్ కుమార్ యాదవ్ పై కేసు నమోదు చేసిన పోలీసులు ఆ కేసులో నోటీసులు జారీ చేశారు.
కోవూరులో జరిగిన వైసీపీ సమావేశంలో తనను అసభ్యంగా దూషించారని ఆరోపిస్తూ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ఈ నెల 26న ఉదయం పది గంటలకు కోవూరు పోలీసు స్టేషన్ లో విచారణకు రావాల్సిందిగా ఆ నోటీసులో పేర్కొన్నారు. కాగా పోలీసులు నోటీసులు ఇవ్వడానికి వెళ్లిన సమయంలో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తన నివాసంలో లేకపోవడంతో ఆయన నివాసానికి నోటీసు అంటించి వెళ్లారు. ఇలా ఉండగా క్వార్ట్జ్ అక్రమ తవ్వకాల కేసులో అరెస్టైన అనిల్ కుమార్ యాదవ్ సన్నిహితుడు బిరదవోలు శ్రీకాంత్ రెడ్డి వాంగ్మూలం ఆధారంగా ఆ కేసులో కూడా మాజీ మంత్రికి ఒకటి రెండు రోజులలో నోటీసులు ఇచ్చే అవకాశం ఉందని అంటున్నారు.