డల్లాస్ లో కొడాలి నాని గురించి లోకేష్ ఏమన్నారంటే?

ఆంధ్రప్రదేశ్ ఐటీ మంత్రి నారాలోకేష్ ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే.   ఆరు రోజుల అమెరికా పర్యటనలో  లోకేష్ లక్ష్యం పెట్టుబడుల ఆకర్షణే. అందులో భాగంగానే ప్రస్తుతం డల్లాస్ లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా నారా లోకేష్ డల్లాస్ లో తెలుగు కమ్యూనిటీ విత్ లోకేష్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్ ఆర్ఐలు కష్టకాలంలో తెలుగుదేశం పార్టీకి ఎంత అండగా నిలిచారో వివరించారు.

రాష్ట్రం నంబర్ వన్ గా ఎదగడంలో ఎన్ఆర్ఐల సహకారం కావాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఒక ఎన్ఆర్ఐ కొడాలి నాని గురించి అడిగారు. అధికారం అండ చూసుకుని అరాచకత్వంతో రెచ్చిపోయిన కొడాలి నానిపై ఏం చర్యలు తీసుకుంటారంటూ ప్రశ్నించారు. అయితే ఆ ప్రశ్నకు ఇంత దూరం వచ్చి ఆ సన్నాసి గురించి ఎందుకు అంటూ లోకేష్ సమాధానం ఇచ్చారు.   అంధ్రప్రదేశ్ ను నంబర్ వన్ గా నిలబెట్టేందుకు అందరం సమష్టిగా కృషి చేయాలి, అందరూ దానిపైనే దృష్టి పెట్టాలి అని చెప్పిన ఆయన అనవసర విషయాల ప్రస్తావన ఎందుకంటూ వ్యాఖ్యానించారు.  

Online Jyotish
Tone Academy
KidsOne Telugu