ఉప్పొంగి ప్రవహిస్తున్న కావేరీ నది.. 84 ఏళ్లలో ఇదే తొలిసారి
posted on Jul 24, 2025 10:44AM

కావేరీ నది పొంగి ప్రవహిస్తున్నది. దాదాపు 84 ఏళ్ల తరువాత ఈ నదిలో ఈ స్థాయి నీటిమట్టం రావడం ఇదే మొదటి సారి. ఈ నదిపై 1932లో కృష్ణసాగర్ డ్యాం నిర్మించిన తరువాత ఇక్కడ నుంచి నీటిని దిగువకు విడుదల చేయడం ఇది రెండో సారి మాత్రమే. ఎప్పుడో 1941లో కావేరీ నదికి ఉధృతంగా వరదలు వచ్చిన సమయంలో డ్యామ్ గేట్లు ఎత్తి నీటిని విడుదల చేశారు.
మళ్లీ ఇంత కాలానికి ఈ ఏడాది జులైలో కావేరీ నది నుంచి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని కర్నాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య కేఎస్ఆర్ డ్యాం వద్ద కావేరీ నదికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. డ్యామ్ నిర్మాణం తరువాత తొలి సారిగా జలాశయం పూర్తి స్థాయి నీటిమట్టం 124.4 అడుగుల స్థాయికి చేరుకుంది.