ఏపీ కేబినెట్ భేటీ.. ఏయే అంశాలపై చర్చిస్తున్నారంటే..?

ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం ముఖ్యమత్రి చంద్రబాబు అధ్యక్షతన ఈ రోజు ప్రారంభమైంది.  ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రులు పాల్గొన్న ఈ సమావేశంలో మొత్తం 42 అంశాలపై చర్చించే అవకాశం ఉంది. ప్రధానంగా  ఏపీ అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై ఈ సమావేశంలో చర్చించి సభా నిర్వహణ తేదీలపై నిర్ణయం తీసుకోనున్నారు.  

అలాగే బీపీఎస్, ఎల్ఆర్ఎస్ పథకాలకు మంత్రివర్గం ఆమోదముద్రవేయనుంది.  అదే విధంగా ముఖ్యమంత్రి సింగపూర్ పర్యటనపై కూడా కేబినెట్ చర్చిస్తుంది.  ఇక ఎస్ఐపీబీ ప్రతిపాదనలకు ఏపీ కేబినెట్ ఈ భేటీలో ఆమోదం తెలిపే అవకాశం ఉంది. అలాగే సీఆర్డీఏ ప్రతిపాదనలపై కూడా చర్చించి ఆమోదముద్ర వేసే అవకాశాలు ఉన్నాయి.  అదే విధంగా పలు సంస్థలకు భూ కేటాయింపుపై కేబినెట్‌ నిర్ణయం తీసుకునే చాన్స్ ఉంది.  ప్రభుత్వంలో కొత్తగా సైన్స్ అండ్ టెక్నాలాజీ   శాఖ ఏర్పాటుపై  చర్చించే అవకాశం ఉంది.  

Online Jyotish
Tone Academy
KidsOne Telugu