లిక్కర్ సిండికేట్ లో ఎక్సైజ్ శాఖ మంత్రి మోపిదేవి ?

కర్నాటకలో మైనింగ్ సిండికేట్లు రాజకీయాల్లో ప్రవేశించి కొంతకాలం అక్కడ సమాంతర పాలన నిర్వహించాయి. ఇప్పుడు రాష్ట్రంలోని  లిక్కర్ సిండికేట్లు అలానే మారుతున్నాయి. ఇక్కడి లిక్కర్ సిండికేట్లలో కూడా రాజకీయ నాయకులదే పెద్దవాటా! సాక్షాత్తు రాష్ట్ర ప్రాహిబిషన్ - ఎక్సైస్ శాఖ , మంత్రి మోపిదేవి రమణ కూడా ఈ సిండికేట్ లో భాగస్వామేనని గుంటూరు జిల్లాలో  ప్రచారం జరుగుతోంది. ఆయనకు జిల్లాలోని 28 మద్యం షాపుల్లో వాటాలున్నట్లు ప్రచారం జరుగుతోంది. జిల్లాలో దుర్గా దేవి పేరిట ఉన్న దాదాపు 150 వైన్ షాపుల్లో జిల్లాకు చెందిన మరో మంత్రికి వాటాలు ఉన్నట్లు సమాచారం. ఇది నిజమేనన్నట్లుగా ఈ షాపులపై  సంబంధిత శాఖ అధికారులు ఏనాడూ కన్నెత్తి చూడరు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu