బీజేపీ అసలు రంగు బయటపడింది : సోనియా

న్యూఢిల్లీ : రాజ్యాంగ సవరణ బిల్లును వ్యతిరేకించడంలో బీజేపీ అసలు రంగు బయటపడిందని కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా  గాంధి   అన్నారు.కేంద్రం ప్రవేశపెట్టిన లోక్పాల్ బిల్లుకు మంగళవారం లోక్‌సభ ఆమోదముద్ర వేసిన విషయం తెల్సిందే. ఈ బిల్లును బీజేపీ తీవ్రంగా వ్యతిరేకించింది. బిల్లు ఆమోదానికి వ్యతిరేకంగా ఓటు వేసింది.దీనిపై సోనియా గాంధీ మాట్లాడుతూ దేశంలో అవినీతిని నిర్మూలించాలన్న ధ్యేయం ప్రధాన ప్రతిపక్షమైన భారతీయ జనతా పార్టీకి లేశమాత్రం కూడా లేదని యూపీఏ ఛైర్‌పర్సన్ సోనియా గాంధీ ఆరోపించారు.అవినీతిని నిర్మూలించన్న లక్ష్యంతోనే బిల్లును ప్రవేశపెట్టామని  కానీ, భాజపాకు అలాంటి ఉద్దేశ్యం లేదన్నారు. అందుకే ప్రభుత్వం ప్రవేశపెట్టిన లోక్పాల్ బిల్లుకు ఆ పార్టీ మద్దతు ఇవ్వలేదని మండిపడ్డారు. బిల్లును బలపర్చేందుకు తాము ప్రయత్నించామని, కానీ బీజేపీ వ్యతిరేకించిందని ఆమె అన్నారు. బిల్లు స్థాయి సంఘం దగ్గర ఉన్నప్పుడే రాజ్యాంగ బద్ధత విషయంలో బీజేపీ కట్టుబడి ఉన్నట్టు తెలిపి, ఇప్పుడు అసలు రూపం బయపెట్టిందని ఆమె విమర్శించారు. రాజ్యసభలో లోక్‌పాల్‌ బిల్లు ఆమోదం పొందేందుకు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారన్న మీడియా ప్రశ్నకు ఆమె సమాధానం దాటవేశారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu