లగడపాటికి కమ్మతనం తగ్గిందా?
posted on Dec 28, 2011 1:20PM
విజయవాడ లోక్ సభ సభ్యుడు లగడపాటి రాజగోపాల్ తెలంగాణా ఉద్యమం పుణ్యమాని రాష్టవ్యాప్త ప్రచారం పొందారు. ఒకప్పుడు తెలుగుదేశం పార్టీనాయకుడిగా ఢిల్లీలో చక్రం తిప్పిన పర్వతనేని ఉపేంద్రకు అల్లుడై రాజకీయ, వ్యాపార రంగాల్లో అల్లుకుపోయి చివరకు మామకే కుచ్చుటోపి పెట్టాడు. తర్వాత కట్టుకున్న భార్యపై మోజు తగ్గించుకుని విజయవాడ పోలిస్ కమీషనరేట్ లో పి.అర్.ఓ. గా పనిచేస్తున్న వనజా అయ్యంగార్ ను గాంధర్వ వివాహం చేసుకున్నాడు. వీరి కలయిక పర్వతనేని ఉపేంద్రకు తీవ్ర మనోవేదనను మిగిల్చింది. ఆయన మరణానంతరం ఉపేంద్ర వర్గీయులు పలువురు లగడపాటిపై బహిరంగంగానే కత్తి గట్టారు. దీనికి తోడు లగడపాటి వనజా అయ్యంగార్ ను వెంటేసుకు తిరుగుతుండడంతో ఆయన మెదటి భార్య పద్మ అపరకాళిగా మారింది. అయినా లగడపాటి లో మార్పురాలేదు. లగడపాటి వ్యవహార శైలి, నైతిక ప్రవర్తన విజయవాడ లోక్ సభ పరిధిలోకి కాంగ్రెస్ నాయకులకు ముఖ్యంగా కమ్మ నాయకులకు ఏ మాత్రం రుచించడం లేదు.గత ఎన్నికల్లో అతి కష్టంమీద గట్టెక్కిన లగడపాటి వచ్చే ఎన్నికల్లో ఇక్కడ నుంచి పోటీ చేస్తారో లేదో నన్న అనుమానం కూడా వారికి కలుగుతోంది. ఈ నేపధ్యంలో ఇటీవల ఈ ప్రాంతానికి చెందిన కొందరు పలుకుబడి గల కమ్మ నాయకులు, వ్యాపార వేత్తలు సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై కూలంకుషంగా చర్చించినట్లు తెలిసింది. లగడపాటి ఎంపీగా తన పారిశ్రామిక సామ్రాజ్యాన్ని అనేక రెట్లు పెంచుకున్నాడే తప్ప తమకు ఒరగబెట్టిందేమీ లేదనే అభిప్రాయానికి వారు వచ్చినట్లు తెలిసింది. లగడపాటికి వ్యతిరేకంగా జరిగే కార్యక్రమాలకు చేయూతనివ్వాలనే నిర్ణయానికి వచ్చారు. తాజాగా డిసెంబర్ 25వ తేదీ ఆదివారం విజయవాడలో కాంగ్రెస్ నాయకుడు కొలనుకొండ శివాజీ నిర్వహించిన లగడపాటి వ్యతిరేక వర్గీయుల సభకు డైరక్షన్లు వీరే ఇచ్చినట్లు తెలిసింది. ఈ తాజాపరిణామాలను మాజీ మంత్రి దేవినేని రాజశేఖర్ తనకు అనుకూలంగా మార్చుకోవడానికి నడుంబిగించారు. నిజానికి లగడపాటి - దేవినేని మధ్య ఆత్మీయ సంబంధాలు ఏనాడు లేవు. లగడపాటి దేవినేనిని పట్టించుకోనట్లుగా వ్యవహరిస్తున్నారు. లగడపాటి వైఖరి దేవినేని అనుయాయులైన పలువురు కమ్మ నాయకులకు చాలాకాలంగా ఇబ్బందిగానే ఉంది. అదును చూసి లగడపాటిని దెబ్బతీయాలనుకునే కమ్మ ప్రముఖుల సంఖ్య నానాటికి పెరుగుతోంది. కమ్ముకొస్తున్న కమ్మ వ్యతిరేకతను లగడపాటి ఎలా ఎదుర్కొంటారన్న విషయం ఆసక్తికరంగా మారింది.