హైదరాబాద్‌లో కుండపోత వర్షం
posted on Sep 18, 2025 5:10PM

హైదరాబాద్‌లో కుండపోత వర్షం కురుస్తోంది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, ఫిల్మ్‌నగర్, ఎర్రగడ్డ, యూసఫ్‌గూడ, అమీర్‌పేట, బోరబండ, చార్మినార్, కుషాయిగూడ, సైనిక్‌పురి వంటి ప్రాంతాల్లో వర్షం కొనసాగుతోంది. వర్షంతో రహదారులు జలమయమై, రోడ్లపై నీరు నిలిచిపోవడంతో వాహనదారులు, ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా మరో మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ముఖ్యంగా ఇవాళ కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట, వికారాబాద్, సూర్యాపేట, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేయగా, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది.