పనిచేసిన బాబు ఐడియా... జగన్ ను పట్టించుకోని జనం
posted on Oct 9, 2015 6:20PM

రాజకీయాల్లో టైమ్ చాలా ఇంపార్టెంట్... వేటగాడు గురిచూసి కొట్టినట్లే... పొలిటికల్ లీడర్స్ కూడా టైమ్ చూసి కొట్టాలి... లేదంటే మిస్ ఫైరై సీన్ రివర్స్ అయిపోతుంది. తన దగ్గరున్న ఆయుధాలను సరైన టైమ్ చూసుకుని వదలాలి... అప్పుడే టార్గెట్ రీచ్ అవుతారు. అలాకాకుండా బాణం ఉందికదా అని ఎప్పుడుబడితే అప్పుడు వదిలేస్తే బోల్తా కొట్టేయడం ఖాయం. సేమ్ టు సేమ్ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గుంటూరులో చేపట్టిన ప్రత్యేక దీక్ష కూడా అలాగే ఉంది, ఎంచుకున్న లక్ష్యం మంచిదే... కానీ టైమే రాంగ్. అందుకే ప్రత్యేక హోదా అంశంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను, ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబుని ఇరుకునపెడదామనుకున్న జగన్ వ్యూహం పారలేదంటున్నారు. చంద్రబాబు వ్యూహాత్మకంగా చేస్తున్న అమరావతి శంకుస్థాపన హడావిడి సునామీలో జగన్ దీక్ష కొట్టుకుపోయిందని, అందుకే జనం నుంచి స్పందన లేదంటున్నారు పొలిటికల్ అనలిస్టులు.
మీడియా మేనేజ్ మెంట్ లో దిట్టయిన చంద్రబాబునాయుడు... అమరావతి శంకుస్థాపన కార్యక్రమాన్ని చరిత్రలో నిలిచిపోయేలా అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తామంటూ చంద్రబాబు హైప్ క్రియేట్ చేయడంతో జనం దృష్టంతా అటువైపు మళ్లిందంటున్నారు. అమరావతి శంకుస్థాపన కార్యక్రమం నభూతో న భవిష్యత్ అన్న రీతిలో చేస్తామంటూ బాబు హడావిడి చేస్తుండటంతో, జగన్ దీక్షను జనం పట్టించుకోవడం లేదంటున్నారు,
అయితే ఇప్పటికే నాలుగైదు వాయిదా తర్వాత దీక్ష చేపట్టిన జగన్ కు పొలిటికల్ అడ్వైజర్స్ సరైన సలహాలు ఇవ్వలేకపోతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి, అందుకే రాంగ్ గైడెన్స్ తో రాంగ్ టైమ్ లో దీక్ష చేపట్టాడని అంటున్నారు, అదే రాజధాని శంకుస్థాపన కార్యక్రమం ముగిశాక దీక్ష ప్లాన్ చేసుకుని ఉంటే బాగుండేదని, అమరావతి వేదికగా ప్రధాని మోడీ ఏపీకి వరాలు ప్రకటించే అవకాశమున్నందున, మోడీ వచ్చి వెళ్లాక దీక్ష చేపట్టి ఉంటే జనం నుంచి స్పందన వచ్చుండేదని, ఎటూకాని టైమ్ లో దీక్ష చేయడంతో తేలిపోయిందంటున్నారు.