జగన్ మైనస్సే... చంద్రబాబుకు ప్లస్...
posted on Oct 9, 2015 6:45PM

మీడియా మేనేజ్ మెంట్ లో దిట్టయిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు... జనం దృష్టిని తెలివిగా తనవైపు తిప్పుకున్నారు, ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ గుంటూరులో వైసీపీ అధినేత జగన్ దీక్ష చేస్తున్నా... జనం ఫోకస్ మాత్రం అమరావతిపైనే పడేలా చేయడంలో బాబు సక్సెస్ అయ్యారు. అమరావతి శంకుస్థాపన కార్యక్రమాన్ని చరిత్రలో నిలిచిపోయేలా అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తామంటూ చంద్రబాబు హైప్ క్రియేట్ చేయడంతో జనం దృష్టంతా అటువైపు మళ్లింది
నవ్యాంధ్ర శంకుస్థాపన కార్యక్రమ ఏర్పాట్లకు పెద్దఎత్తున ప్రచారం వచ్చేలా చేయడంలో చంద్రబాబు సక్సెస్ అయ్యారు, పైగా శంకుస్థాపన జరిగే చోట మీ ఊరి నీళ్లు, మీ ఊరి మట్టి తెచ్చి కలపాలంటూ చంద్రబాబు వదిలిన సెంటిమెంట్ డైలాగులు జనాన్ని ఆకట్టుకుంటున్నాయి. మన రాజధాని, మన మట్టి అనే భావన అందరిలో కలగాలని, అన్ని గ్రామాల నుంచి తీసుకొచ్చిన మట్టితో స్మారకస్థూపం నిర్మించాలని, యువకులంతా సంకల్ప జ్యోతిలో భాగస్వాములు కావాలంటూ ఇచ్చిన పిలుపు చంద్ర మంత్రంలా పనిచేస్తోందంటున్నారు, మరోవైపు శంకుస్థాపన కార్యక్రమానికి దేశ విదేశీ ప్రతినిధులు, ప్రధాని నరేంద్రమోడీ, కేంద్ర మంత్రులు, బడా పారిశ్రామికవేత్తలు, సినీరాజకీయ దిగ్గజాలతోపాటు అతిరథ మహారథులంతా తరలిరానున్నారంటూ జరుగుతున్న ప్రచారంతో జనం అటెన్షన్ అమరావతిపై పడిందంటున్నారు.
అదే సమయంలో మీడియా మేనేజ్ మెంట్ చేతగాని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి... చేపట్టిన ప్రత్యేక దీక్ష తుస్సమందంటున్నారు, జనం అసలు పట్టించుకోవడమే మానేయగా, వైసీపీ శ్రేణుల నుంచి కూడా అంతంత మాత్రంగానే స్పందన వస్తోందని అంటున్నారు.