జగన్ దీక్ష తరువాత ఏమిటి?

posted on: Oct 9, 2015 8:58AM

 

వైయస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక హోదా కోసం చేపట్టిన నిరవధిక నిరాహార దీక్ష నేటితో మూడవరోజుకి చేరింది. వైద్యులు రోజూ అయనకి వైద్య పరీక్షలు నిర్వహించి ఆరోగ్యపరిస్థితిని గమనిస్తున్నారు. రెండు రోజులుగా ఆయన ఆహారం తీసుకోకపోవడంతో క్రమంగా ఆయన నీరసిస్తున్నారు. కనుక రేపో మాపో పోలీసులు రంగ ప్రవేశం చేసి ఆయన దీక్షను భగ్నం చేసి ఆసుపత్రికి తరలించవచ్చును. జగన్ చేస్తున్న దీక్ష గురించి మిగిలిన మీడియా అంతగా పట్టించుకోకపోవడంతో ఆయన స్వంత మీడియా సాక్షి ద్వారానే నిరంతర కవరేజ్ చేసుకోవలసి వస్తోంది. ఈ దీక్షకు ప్రజల నుండి ఆశించినంతగా స్పందన రాకపోవడంతో వైకాపా నేతలు ఎప్పటికప్పుడు జనసమీకరణ చేస్తూ దీక్ష విజయవంతం అయ్యిందనే భావన వ్యాపింపజేసేందుకు ఆపసోపాలు పడవలసివస్తోంది.

 

జగన్ దీక్షకు మద్దతుగా నేడు మండల కేంద్రాలలో, రేపు నియోజక వర్గాలలో వైకాపా ర్యాలీలు నిర్వహించాలని నిర్ణయించుకొంది. బహుశః ఆ విధంగా జగన్ దీక్ష గురించి రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేసి, ప్రజలందరూ ఆయనకి మద్దతు తెలుపుతున్నారనే భావన వ్యాపింపజేయాలని వైకాపా భావిస్తోందేమో? కానీ జగన్ ఈ దీక్ష ముగించిన తరువాత ప్రత్యేక హోదా కోసం ఏవిధంగా పోరాడబోతున్నారు? ప్రజల నుండి ఆశించినంత స్పందన రావడం లేదు కనుక తన పోరాటాలని విరమించుకొని ఇదివరకు లాగే వేరే అంశానికి షిఫ్ట్ అయిపోతారా? లేక పోరాటాన్ని కొనసాగిస్తారా? అనేది వేచి చూడాలి.

google-ad-img
    Related Sigment News
    • Loading...