జగన్.. నువ్వు ఆల్రెడీ చచ్చావ్!

వైసీపీ నాయకుడు జగన్‌ని చూస్తుంటే, ఇతనెక్కడి మనిషి అనిపించడం లేదు.. అసలు ఇతను మనిషేనా అనిపిస్తోంది. ఐదేళ్ళ కాలంలో రాష్ట్రాన్ని సర్వనాశనం చేసింది కాక, ఇప్పుడు దారుణంగా ఓడిపోయినా బుద్ధి తెచ్చుకోకుండా తన అసలు బుద్ధిని జాతీయ స్థాయిలో చూపించుకుంటున్నాడు. ఈ మహానటుడు ఢిల్లీలో పనికిరాని హడావిడి చేసిన అనంతరం ఓ నేషనల్ ఛానల్‌తో మాట్లాడుతూ, సుద్దపూసలాగా, అమాయక చక్రవర్తిలాగా స్టేట్మెంట్ ఇచ్చాడు. ‘‘నన్ను చంపాలనుకుంటే చంపేయండి. మాకు ఓటేయని వారిని, మా కార్యకర్తలను ఎందుకు లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడుతున్నారు. మా పాలనలో ఎప్పుడూ ప్రతిపక్షాల మీద దాడులు చేయలేదు. మీరు నన్ను టార్గెట్ చేస్తే చేసుకోండి. నాపై కోపం ఉంటే నన్ను చంపేయండి’’ అంటూ ఎమోషనల్‌గా మాట్లాడి, తన నాటకాన్ని రక్తికట్టించే ప్రయత్నం చేశాడు. కానీ, నిన్ను ఎవరూ చంపరు జగన్.. ఎందుకంటే, నువ్వు ఆల్రెడీ చచ్చావ్!

* అసెంబ్లీ సాక్షిగా నీ తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి నిన్ను తక్కువ చేసి మాట్లాడినప్పుడే నువ్వు చచ్చావ్!

* తండ్రిని అడ్డం పెట్టుకుని క్విడ్ ప్రో కో ద్వారా వేల కోట్లు సంపాదించినప్పుడే నువ్వు చచ్చావ్!

* నీ తండ్రి శవాన్ని ఎదురుగా పెట్టుకుని ముఖ్యమంత్రి పదవి కోసం సంతకాల సేకరణ చేసినప్పుడే నువ్వు చచ్చావ్!

* పదహారు నెలలపాటు జైల్లో వున్నప్పుడే నువ్వు చచ్చావ్!

* ఓట్ల కోసం హిందూ మతంలోకి మారినట్టు నటించినప్పుడే నువ్వు చచ్చావ్!

* 151 అసెంబ్లీ స్థానాలు ఇచ్చి నిన్ను ముఖ్యమంత్రి స్థానం మీద కూర్చోబెట్టిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినప్పుడే నువ్వు చచ్చావ్!

* ఏ నేరమూ చేయని చంద్రబాబు నాయుడిని వ్యక్తిగతంగా అవమానించినప్పుడు, జైలుకు పంపినప్పుడే నువ్వు చచ్చావ్!

* కన్నతల్లి, సొంత చెల్లి నీకు దూరమైపోయినప్పుడే నువ్వు చచ్చావ్!

* నీకు 151 సీట్లు  ఇచ్చిన ప్రజలే నిన్ను 11 స్థానాలకు పరిమితం చేసి, చివరికి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వనప్పుడే నువ్వు చచ్చావ్!

* దారుణంగా ఓడిపోయినప్పటికీ, నీ తప్పులు తెలుసుకోకుండా నీ వ్యవహారశైలిని మార్చుకోకుండా దారుణంగా వ్యవహరిస్తున్నావు చూశావా.. అలా నువ్వు జనం దృష్టిలో క్షణం క్షణం చస్తున్నావ్... అందువల్ల మిస్టర్ జగన్... ఆల్రెడీ నువ్వు శవానివి... ఇక నిన్ను ప్రత్యేకంగా చంపాల్సిన అవసరం ఎవరికీ లేదు.. రెస్ట్ ఇన్ పీస్!

Online Jyotish
Tone Academy
KidsOne Telugu