బెయిల్ కోసం పోరాడుతున్న జగన్
posted on Dec 1, 2012 12:58PM
.jpg)
అక్రమాస్తుల కేసులో అరెస్ట్ అయి చంచల్ గూడ జైలులో ఉన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బెయిల్ కోసం హైకోర్టు లో పిటీషన్ దాఖలు చేశారు. సిబిఐ తనను అరెస్టు చేసి 90 రోజులు దాటినప్పటికీ ఇంకా ఛార్జ్ షీట్ దాఖలు చేయనందున క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లోని 167 (2) సెక్షన్ ప్రకారం తనకు బెయిల్ మంజూరు చేయాలని జగన్ కోర్టును కోరారు.
జగన్ బెయిల్ పిటీషన్ ను సిబిఐ రెండు రోజుల క్రితం తోసిపుచ్చిన విషయం తెలిసిందే. సిబిఐ కోర్టు ఆదేశాలను సవాలు చేస్తూ జగన్ హై కోర్టును ఆశ్రయించారు. ఇప్పటికే, బెయిల్ కోసం జగన్ చేసిన నాలుగు ప్రయత్నాలు విఫలమయ్యాయి.
ఫార్మా కంపెనీలో కుట్ర వ్యవహారం లో విచారణ పూర్తయినందున తనకు బెయిల్ ఇవ్వాలని జగన్ సిబిఐ కోర్టులో మరో పిటీషన్ దాఖలు చేశారు. ఈ కోర్టు తన నిర్ణయాన్ని డిసెంబర్ 4 కు వాయిదా వేసింది.