జగన్ అప్పురత్న.. పవన్ సెటైర్

మహా రచయత ముళ్లపూడి వెంకటరమణ సృష్టించిన అప్పారావు పాత్ర తెలుగు సాహిత్యంలో ఎంతలా చిరస్థాయిగా నిలిచిపోయిందో మనకందరికీ తెలుసు. అలాగే ఇప్పుడు జనసేనాని పవన్ కల్యాణ్  జగన్ ను అప్పురత్నగా చేసిన అభివర్ణన ఏపీ రాజకీయ చరిత్రలో అలాగే నిలిచిపోతుంది. పవన్ కల్యాణ్ జనసేనాని జగన్ ను అప్పురత్నగా అభివర్ణిస్తూ సామాజిక మాధ్యమంలో ఇలా కార్టూన్ పోస్టు చేశారో లేదో.. వెంటనే ట్రెండింగ్ అయిపోయింది.

ఏపీ సీఎం జగన్ అప్పులపై జనసేనాని సెటైర్ క్షణాల్లో సామాజిక మాధ్యమంలో వైరల్ అయిపోయింది. అది ఎంతగా ట్రెండ్ అవుతోందంటే.. ఇక ముందు ఎవరూ జగన్ ను జగన్ గా సంబోధించే అవకాశం ఇసుమంతైనా కనిపించడం లేదన్నంతగా. ఇక నుంచి జగన్ కు అప్పురత్న అన్నది పర్యాయపదంగా మారిపోయినా ఆశ్చర్యపోనవసరం లేదన్నంతగా నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.

ఇక పవన్ కల్యాణ్ జగన్ కు అప్పురత్న బిరుదు వచ్చిందనీ, అది భారత రత్న లాంటి గొప్ప అవార్డనీ అధికారి చెబుతున్నట్లుగా ఉన్న కార్టూన్ ను సామాజిక మాధ్యమంలో షేర్ చేసీ చేయగానే వైరల్ అయిపోయింది. ఆ సెటైర్ బ్రహ్మాండంగా పేలింది. వైసీపీ సర్కార్ కేవలం తొమ్మిది నెలల కాలంలోనే ఆర్బీఐ నుంచి 55,555 కోట్ల రూపాయలు అప్పు తీసుకువచ్చిందన్నది గణాంకాలు వెల్లడిస్తున్నాయి.

దానిపైనే పవన్ ఈ కార్టూన్ ను సామాజిక మాధ్యమంలో షేర్ చేశారు. వ్యక్తిగత ఆస్తులను పెంచుకుంటూ, రాష్ట్రం, ప్రజల ఆస్తులను కుక్కలకు వదిలేశారనీ అదే సీఎం జగన్ స్పిరిట్ అంటూ వ్యాఖ్యానించారు. గతంలో కూడా అవినీతికి క్రాప్ హాలీడే అంటూ వేసిన కార్టూన్ కూడా అప్పట్లో ట్రెండింగ్ అయిన సంగతి తెలిసిందే.