జగన్ దీక్షపై గందరగోళం, అక్టోబర్ 7పైనా సందేహాలు

సెప్టెంబర్ 15, సెప్టెంబర్ 20, సెప్టెంబర్ 26, అక్టోబర్ 7... ఈ డేట్స్ ఏమైనా గ్రూప్ వన్ లేదా గ్రూప్ 2 ఎగ్జామ్స్ షెడ్యూల్ అనుకుంటున్నారా? ఈ తేదీల మధ్య గ్యాప్ చూస్తుంటే అలాగే ఉంది కదా; కానీ ఇవి జగన్ దీక్ష వాయిదా తేదీలు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఏ ఆందోళనా కార్యక్రమం ప్రకటించినా కనీసం మూడు నాలుగు తేదీలు మార్చడం కామన్, ఇప్పుడు జగన్ హోదా దీక్ష విషయంలోనూ అదే చేశారు, మొదట సెప్టెంబర్ 15నుంచి జగన్ దీక్ష చేస్తాడని వైసీపీ నేతలు ఆర్భాటంగా ప్రకటించారు, అంతలోనే దాన్ని కాస్తా 20కి మార్చారు, పోనీ ఇదైనా కన్ఫ్మామ్ అయ్యిందా అంటే అదీ లేదు, వినాయకచవితి పేరుతో మళ్లీ సెప్టెంబర్ 26కి మారింది, చివరికి అక్టోబర్ 7కి వాయిదా పడింది.

ఒక దీక్ష... నాలుగు వాయిదాలు... ఇదీ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి దీక్ష పరిస్థితి, ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా సాధన కోసం నిరవధిక నిరాహార దీక్ష చేస్తానని ప్రకటించిన జగన్... అటు నాయకులను... ఇటు కార్యకర్తలను గందరగోళంలోకి నెడుతున్నారు, ఒకే నెలలో మూడు తేదీలు మార్చేసి, చివరికి దాన్ని అక్టోబర్ 7కి వాయిదా వేయడం, ఆరోజైనా కచ్చితంగా జరుగుతుందో లేదో చెప్పలేని పరిస్థితి, ఇలా ఇష్టమొచ్చినట్లు తేదీలను మార్చడం, ముందస్తు వ్యూహం, అనుమతులు లేకుండా ఏర్పాట్లు చేయడం...ఇవన్నీ కార్యకర్తల్లో నిరుత్సాహాన్ని నింపుతోంది

అయితే ఇదంతా కాకతాళీయంగానే జరిగిందా? లేక ప్లాన్ ప్రకారం చేశారా? ఈ డౌట్ వచ్చింది ఎవరికో కాదు...సొంత పార్టీ కార్యకర్తలకే... అసలు జగన్ కు దీక్ష చేయాలని లేదని, అందుకే తేదీల మీద తేదీలు మారుస్తున్నారని కొందరు మండిపడుతున్నారు, ఇప్పటికే నాలుగుసార్లు తేదీలు మార్చడంతో కార్యకర్తల్లో నిరుత్సాహం వచ్చేసిందని, ఇప్పుడు దీక్షకు రమ్మన్నా వచ్చే పరిస్థితి లేదంటున్నారు. పైగా అసలు అనుమతులేమీ తీసుకోకుండా గుంటూరులో ఏర్పాట్లు ఎలా చేశారని ప్రశ్నిస్తున్నారు, కనీసం అక్టోబర్ 7న అయినా దీక్ష ఉంటుందో లేదో తెలియడం లేదని, జగన్ వైఖరితో నేతలు కూడా విసిగిపోయారని అంటున్నారు, పార్టీ ఆదేశాలతో కార్యకర్తలను గుంటూరు తరలించడానికి ఏర్పాట్లు చేసుకుంటే, చివరికి దీక్షను వాయిదా వేశారని మండిపడుతున్నారు.

అయితే జగన్ దీక్షపై ఇంకా గందరగోళం కనిపిస్తోంది, అక్టోబర్ 7కి వాయిదా పడినా, ఆరోజైనా కచ్చితంగా మొదలవుతుందని చెప్పలేని పరిస్థితి, దాంతో జగన్ దీక్షను కార్యకర్తలు కూడా లైట్ తీసుకుంటున్నారు, దీక్ష జరిగినప్పుడు చూద్దాంలే అంటూ కామెంట్స్ చేస్తున్నారు, మరి అక్టోబర్ ఏడునైనా దీక్ష జరుగుతుందో లేదో చూడాలి .

Online Jyotish
Tone Academy
KidsOne Telugu