బరితెగించడమే బిగ్ బాస్ ఎంట్రీకి అర్హతా!?
posted on Oct 17, 2025 2:21PM

ఈ మధ్య కాలంలో ఎవరైతే సోషల్ మీడియా మీద ఏదో ఒక చెడు వ్యవహారంలో బరితెగిస్తారో.. వారికి బిగ్ బాస్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ లభిస్తోంది.. అన్న కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ విషయంపై సీపీఐ నారాయణ ఎప్పటి నుంచో కామెంట్లు చేస్తున్నారు. ఇదొక చెత్త ప్రొగ్రాం దీన్ని బహిష్కరించాలన్నట్టుగా ఆయన మాట్లాడుతున్నారు. ఇప్పుడు సాదా సీదా మనుషుల నుంచి కూడా సేమ్ టు సేమ్ ఇలాంటి కామెంట్లే వినిపిస్తున్నాయ్. అదేంటో చూస్తే.. ఒక మాధురి, మరో పచ్చళ్ల అలేఖ్య చిట్టీ.. వంటి వారి ఎంట్రీలో అసలు అర్ధమే లేదంటున్నారు వీరంతా.
మాధురి ఎవరు? ఆమె ఒక బరితెగించిన మహిళ. భర్త ముగ్గురు పిల్లలు ఉండగా, మరొకరితో సహజీవనం చేస్తూ ఆధునిక ఆదర్శ దాంపత్యానికి అసలైన కేరాఫ్ అడ్రెస్ అన్నట్టు పోజులు కొడుతున్నారు. అలాంటి ఆమెను బిగ్ బాస్ లోకి పిలవడం ద్వారా ఈ సమాజానికి ఎలాంటి మెసేజ్ ఇస్తున్నట్టు? అని నిలదీస్తున్నారు కొందరు. ఇక అలేఖ్య చిట్టీ.. వ్యవహారం. రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగానే కాదు ప్రపంచమంతా చూసింది అ పికిల్ సిస్టర్స్ పిచ్చి చేష్టలు. వీరు కస్టమర్స్ తో బిహేవ్ చేసే విధానం ఎంత ఫాల్తు లాంగ్వేజీలో ఉంటుందో అందరికీ తెలిసిందే. అలాంటి వీరిని బిగ్ బాస్ లోకి పంపడం వల్ల ఏం తెలుస్తుందంటే.. ఇలాగే వల్గర్ గా బిహేవ్ చేస్తే బిగ్ బాస్ లోకి వెళ్లొచ్చు కదాని. ఇతరులు కూడా ఇలాగే చేయడం మొదలు పెడతారు.. దీని ద్వారా ఒక్కోసారి కాపురాలు కూలిపోవచ్చు. ఆపై వారి వారి ఉద్యోగ వ్యాపారాలు నాశనమై పోవచ్చని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కొందరు.
కొందరిచ్చే సలహా సూచనలేంటంటే.. ఇలాంటి వారితో హౌస్ నింపడం కన్నా ఆయా వర్గాల్లోని మేథావులను.. హౌస్ కి సెలెక్ట్ చేయడం వల్ల.. వారి మధ్య సాగే విషయ పరిజ్ఞానంతో కూడిన చర్చోపచర్చలు సాగేలాంటి వాతావరణం ఏర్పాటు చేయటం వల్ల ఎంతో మేలు. దీని ద్వారా కొత్త విషయాలు మరింతగా తెలుస్తాయి. మరి కొందరికి ఆయా విషయాల పట్ల ఒక అవగాహన అంటూ ఏర్పడుతుంది.
ఫర్ సపోజ్ ఒక మాదురి ద్వారా ఏం తెలుస్తుంది? పెళ్లయినా సరే, ఇతర పెళ్లైన మగాళ్లతో సహజీవనం చేయడం ఎలా? అన్నది నేర్పించగలరామె. అంతే, అంతకన్నా మించి ఆమెకు ఏదైనా తెలుసా? ఇక పచ్చళ్ల అలేఖ్య చిట్టి పరిస్థితి కూడా అంతే. ఆ మాటకొస్తే హౌసులో ఉన్న ఇతరత్రా కంటెస్టెంట్లు కూడా మేథో సంపన్నులేం కాదు.. గాలి వాటానికి కొట్టుకొచ్చిన బాపతు. కాబట్టి వీరు, వీరి మాటలు, చేతలను చూసే వారు ఏం నేర్చుకుంటారు? అన్న ప్రశ్నకు తలెత్తుతోంది. మరి చూడాలి బిగ్ బాస్ ఈ దిశగా ఏదైనా ప్లాన్ చేస్తారేమో చూడాలి.