ఇనుము... తినుము...



శరీరానికి అవసరమైన మేరకు పోషకాలు తీసుకుంటేనే ఆరోగ్యం సక్రమంగా వుంటుంది.  ఏవి లోపించినా ఏదో ఒక అనారోగ్యంతో ఇబ్బంది పడక తప్పదు.  ముఖ్యంగా పోషకాల  లోపం  దీర్ఘకాలం కొనసాగితే రక్తహీనతకు దారితీయచ్చు. నిజానికి రక్త హీనతతో బాధపడే వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోందని అంటున్నారు నిపుణులు. అందులోనూ పిల్లలలో రక్త హీనత ఎక్కువగా ఉంటోందని చెబుతున్నారు.  రక్త హీనతకి అసలు కారణం ఆహరంలో ఇనుము లోపించటమే. మరి మనకి అత్యంత అవసరమైన ఆ ఇనుము ఏయే ఆహార పదార్థాల నుంచి లభిస్తుంది?

పాలు, పెరుగు, తేనె, మాంసం, చేపలు, గుడ్డు సొన నుంచి  ఇనుము ఎక్కువగా లభిస్తుంది.

పళ్ళలో.... అరటి పండు, ఆపిల్, బత్తాయి, నిమ్మ, ద్రాక్ష, మామిడి, బొప్పాయి, దానిమ్మ.

కూరగాయల్లో... టమోటో, ముల్లంగి, కాకర, ఉల్లిపాయ.

ధాన్యాల్లో... బార్లి, జొన్నలు, వేరుశనగ, మొక్కజొన్న, గోధుమలు వంటి ధాన్యాలలో.

ఇంకా.. బాదాం,శనగ పప్పు, కొబ్బరి, ఖర్జూరా, చెరకు, బెల్లం తదితరాలలో కావల్సినంత ఇనుము లభిస్తుంది.

ఇక ఆకుకూరల విషయానికి వస్తే, మెంతి కూర, పుదీనా, పాలకూర, తోటకూరలలో ఒకదానిని  రోజూ తప్పకుండా తీసుకోవాలి. వీటితో పాటు ములగాకు దొరికితే అది కూడా తప్పక తినండి. ఎందు కంటే  దానిలో కూడా కావలసినంత  ఇనుము వుంటుంది కాబట్టి దానిని తింటే రక్త హీనత దగ్గరకి రాదు.

-రమ

Online Jyotish
Tone Academy
KidsOne Telugu