ఇంటర్నేషనల్ ఏవియేషన్ షోను ప్రారంభించిన రాష్ట్రపతి..
posted on Mar 16, 2016 5:50PM

నేటి నుండి ఐదురోజుల పాటు బేగంపేట ఎయిర్ పోర్టులో జరగనున్న ఇంటర్నేషనల్ ఏవియేషన్ షోను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్, కేసీఆర్, కేంద్రమంత్రి ఆశోకగజపతిరాజు హాజరయ్యారు. ఇంకా ఈ కార్యక్రమానికి 25 దేశాల ప్రభుత్వ ప్రతినిధులు.. 12 దేశాల నుండి 200 కంపెనీల ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి ప్రణబ్ ప్రసంగిస్తూ పౌర విమాన రంగంలో ప్రపంచంలోనే భారత్ 9వ ర్యాంకులో ఉందని, 2020 నాటికి మూడో స్థానానికి చేరుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. ఇండియన్ ఎయిర్‌లైన్స్ రోజుకు లక్షలాది మందిని గమ్యస్థానానికి చేర్చుతుందన్న ప్రణబ్, ఏవియేషన్ రంగంలో తయారీపై దృష్టిసారించామన్నారు.