పుట్టిన రోజున దీపికా పదుకునే కీలక ప్రకటన.. ఆ విధంగా చేస్తే మీకు కూడా సినీ అవకాశాలు
on Jan 5, 2026

-తన బర్త్ డే రోజున దీపికా పదుకునే ప్రకటన చెయ్యడానికి కారణం ఏంటి
-తన ప్రకటనలో ఏముంది!
-ఆన్ సెట్ ద్వారా ఏం జరగబోతుంది
-అప్ కమింగ్ సినిమాల పరిస్థితి ఏంటి
భారతీయ చిత్ర పరిశ్రమ గౌరవం, పరపతి ని పెంచిన అరుదైన నటీమణుల్లో 'దీపికా పదుకునే'(Deepika Padukone)ఒకరు. ఏ క్యారక్టర్ లో అయినా సరే ది బెస్ట్ పెర్ ఫార్మెన్స్ ఇవ్వగలదు. సుమారు రెండు దశాబ్దాల నుంచి ఆ విషయంలో రాజీ పడకుండా మేకర్స్ తన కోసమే క్యారెక్టర్ లు సృష్టించే ఇమేజ్ ని పొందింది. పది సంవత్సరాల క్రితమే అమెరికన్ సినీ మేకర్స్ ట్రిపుల్ ఎక్స్: రిటర్న్ ఆఫ్ జాండర్ కేజ్ లో దీపికా ని నటించడానికి ఒప్పించారు. ఇప్పుడు ఆ చిత్రానికి సీక్వెల్ గా చేస్తున్నారు. దీపికా కోసం ముంబై లోనే ఆమె క్యారక్టర్ కి సంబంధించిన షూటింగ్ ని జరపాలని నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తుంది. దీన్ని బట్టి దీపికా మానియా ని అర్ధం చేసుకోవచ్చు.
ఈ రోజు దీపికా పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆమె సోషల్ మీడియా వేదికగా స్పందిస్తు 'ఆన్ సెట్ '(onset )అనేది నా డ్రీం ప్రాజెక్ట్. ఈ ఆన్ సెట్ ద్వారా సినీ, టీవీ, అడ్వర్టైజింగ్ రంగాల్లోని కొత్త ప్రతిభ ని ప్రోత్సహించబోతున్నాను. ప్రోత్సహించడమే కాదు ఆయా రంగాల్లో అవకాశాలు కూడా కలిపిస్తాను . ఈ ప్రాజెక్ట్ లో ప్రాక్టికల్ లెర్నింగ్ కే ప్రాధాన్యముంటుంది. onsetprogram.in లో మీ పూర్తి వివరాలు, ఏ డిపార్ట్మెంట్ కి శిక్షణ పొందాలనుకుంటున్నారు. ప్రస్తుతం ఏం వర్క్ చేస్తున్నారో తెలపాలని దీపికా పదుకునే కోరారు. ఆ విధంగా అప్లై చేసుకున్న పేర్లలో షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళని ఇంటర్వ్యూ కి పిలుస్తారు. ప్రస్థుతానికి నటన విభాగంలో అవకాశం కల్పించలేదు. దర్శకత్వం, సౌండ్ డిజైన్, ఆర్ట్ అండ్ ప్రొడక్షన్, డిజైన్ లాంటి వాటినే దీపికా ఎంచుకుంది.
Also read: నారీ నారీ నడుమ మురారి ఓటిటి డీల్ ఇదేనా! సంక్రాంతి ఏం జరుగుతుందో మరి
దీపికా కెరీర్ విషయానికి వస్తే ప్రస్తుతం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun),అట్లీ(Atlee)కాంబోలో తెరకెక్కుతున్న ప్రెస్టేజియస్ట్ ప్రాజెక్ట్ లో చేస్తుంది. ఇప్పటికే దీపికా క్యారక్టర్ కి సంబంధించిన లుక్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుండంతో పాటు మూవీలో దీపికా రోల్ చాలా కీలకమని తెలుస్తుంది. దీపికా భర్త ప్రముఖ హీరో రణవీర్ సింగ్(Ranveersingh)ప్రస్తుతం ధురంధర్(Dhurandhar)తో రికార్డుల వేట కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. ఇక అభిమానులు సోషల్ మీడియా వేదికగా దీపికా కి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్తున్నారు.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



