పాక్‌తో యుద్దంపై భారత్ విదేశాంగ శాఖ కీలక ప్రకటన
posted on May 10, 2025 6:27PM

భారత్-పాక్ మధ్య యుద్దంపై విదేశాంగ శాఖ సెక్రటరీ విక్రమ్ మిస్త్రీ కీలక ప్రకటన చేశారు. ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణకు ఒప్పందం జరిగిందని భారత్, పాక్ ప్రధానులు నరేంద్రమోదీ, షెహబాజ్ షరీఫ్, భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్, పాక్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ అసిమ్ మునీర్, ఇరు దేశాల జాతీయ భద్రతా సలహాదారులు అజిత్ డోభాల్, అసిమ్ మాలిక్‌లతో మాట్లాడినట్లు చెప్పారు. తాను, అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఇందుకు సంబంధించిన చర్చల్లో పాల్గొన్నామని పేర్కొన్నారు. సాయంత్రం 5 గంటల నుంచి కాల్పుల విరమణకు అంగీకరించినట్లు ధృవీకరించారు. మధ్యాహ్నం 3.15 గంటలకు భారత్ డీజీఎంఓకి పాక్ డీజీఎంఓ ఫోన్ చేసి కాల్పులు విరమించాలని కోరినట్లు మిస్రీ తెలిపారు. ఈనెల 12న సాయంత్రం 5 గంటలకు మరోసారి ఇరుదేశాల డీజీఎంఓల మధ్య చర్చలు జరగనున్నట్లు చెప్పారు.