సరిహద్దు ప్రాంతాల్లోని ఏపీ వాసుల కోసం కంట్రోల్ రూమ్
posted on May 10, 2025 6:11PM

భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఢిల్లీలోని ఏపీ భవన్‌లో 24 గంటల కంట్రోల్ రూమ్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న ఏపీ ప్రజలకు అవసరమైన సమాచారం, సహాయం అందించేందుకు ప్రత్యేక ఫోన్ నంబర్లు విడుదల చేశారు. పాక్‌తో సరిహద్దు గల రాష్ట్రాలలో నివాసం ఉంటున్న, అక్కడ చిక్కుకున్న ఏపీ ప్రజల సౌకర్యార్థం ఈ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసింది. 24 గంటలూ పనిచేసే ఈ కంట్రోల్ రూమ్ నుంచి కావాల్సిన సమాచారం, సహాయం కోసం 011-23387089, 9871999430, 9871999053 నంబర్లతో పాటు, అదనపు సమాచారం కోసం డిప్యూటీ కమిషనర్ ఎంవీఎస్ రామారావు (9871990081), లైజన్ ఆఫీసర్ సురేశ్‌బాబు (9818395787)ను సంప్రదించవచ్చని ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్ లవ్ అగర్వాల్ సూచించారు.