ఆ చిట్టీల చేతి రాత సంతోష్ దేనా?

తెలంగాణలో సంచలనం సృష్టించిన, సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అత్యంత కీలకమైన విషయం వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో రాధాకిషన్ రావు విచారణలో   బీఆర్ఎస్ హయాంలో అప్పటి సీఎం కేసీఆర్ నివాసం నుంచి చేతిరాతతో కూడిన చిట్టీలు వచ్చేవనీ, ఆ చిట్టీలలోని ఫోన్ నంబర్లను తాము ట్యాప్ చేసేవారమనీ  వెల్లడించారు.  దీంతో ఇప్పుడు ఆ చేతి రాత ఎవరిది అన్న చర్చకు తెరలేచింది.  

అప్పటి సీఎం కేసీఆర్ కు అత్యంత వ్యవహరించిన సంతోష్ రావు చేతిరాతా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సిట్ కూడా ఇప్పుడు ఆయనను కూడా విచారించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.   రిటైర్డ్ ఐపీఎస్ ప్ర‌భాక‌ర్ రావును నిఘా విభాగం స్పెష‌ల్ బ్రాంచ్ఇన్ ఛార్జ్ గా  నియ‌మించ‌డంపైనా సిట్ ఆరా తీస్తోందంటున్నారు. ప్ర‌త్యేకించి ఆయ‌న‌కే  ఈ బాధ్య‌త‌లు ఇవ్వ‌డ‌మేంట‌న్న‌ దిశగా కూడా సిట్ దర్యాప్తు కొనసాగుతోందంటున్నారు. అత్యంత కీలకమైన పదవిని ఒక రిటైర్డ్ అధికారికి కట్టబెట్టడంలోని మతలబుపై సిట్ ఆరాతీస్తున్నట్లు తెలుస్తోంది.  

ఇక పోతే చిట్టీలలో చేతిరాత విషయం నిగ్గు తేల్చేందుకు బీఆర్ఎస్ మాజీ ఎంపీ సంతోష్ రావు  ఫోన్ ట్యాపింగ్ కేసులో  సిట్ అధికారుల ఎదుట మంగళవారం (జనవరి 27)  విచారణకు హాజరు కానున్నారు. ఈ మేరకు సంతోషరావుకు నోటీసులు జారీ అయ్యాయి..మంగళవారం (జనవరి 27) మధ్యాహ్నం మూడు గంటలకు విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. 

ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) కు ఇటీవ‌ల స‌జ్జ‌నార్ ని చీఫ్ గా నియ‌మించిన సంగతి తెలిసిందే. సజ్జనార్ నియామకంపై  బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్  ఒక ఐపీఎస్ ని సిట్ ఇంచార్జ్ ని చేయ‌డ‌మేంట‌ని ప్ర‌వీణ్ ప్ర‌శ్నించారు. ఈ నేపథ్యంలో సిట్ ఆయనకు కూడా నోటీసులు ఇచ్చింది. దీంతో ప్ర‌వీణ్ యూట‌ర్న్ తీస్కున్నారు.  

అదలా ఉంటేఇటు మాజీ మంత్రి హ‌రీష్, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ను కూడా ఇటీవల సిట్ విచారించింది.  ఇక ఇపుడు సంతోష్ రావు వంతు వచ్చిందంటున్నారు.  అదలా ఉంచితే.. బీఆర్ఎస్ కూడా ఫోన్ ట్యాపింగ్ జరగలేదని అనడం లేదు. ఫోన్ ట్యాపింగ్ అన్నది సర్వసాధారణమనీ, అదేం పెద్ద నేరం కాదనీ అంటున్నది.  కేటీఆర్ అయితే ఒక అడుగు ముందుకు వేసి ఫోన్ ట్యాపింగ్ అన్నది పోలీస్ డిపార్ట్ మెంట్ విధి నిర్వహణలో ఒక భాగం అన్నారు.  ఇక ప్రస్తుతానికి వస్తే..    చేతిరాత‌ చిట్టీల వెనుక ఉన్నది సంతోషేనా? అసలు దీని వెనుక దాగి ఉన్న రహస్యం ఏమిటి? అన్న ఆసక్తి, ఉత్కంఠ సర్వత్రా వ్యక్తం అవుతోంది.  

Online Jyotish
Tone Academy
KidsOne Telugu