మైనస్ 20 డిగ్రీల ఉష్ణోగ్రతలోనూ శిక్షణ తరగతులకు.. స్టూడెంట్ రేవంత్!

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యార్థిగా మారారు. ప్రపంచ ప్రఖ్యాత హార్వర్డ్ యూనివర్సిటీలోని కెన్నడీ స్కూల్ ఆప్ గవర్నమెంట్ లో రేవంత్ రెడ్డి ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ తరగతులకు హాజరయ్యారు.  అమెరికాలో తీవ్ర శీతాకాల పరిస్థితులు నెలకొన్నప్పటికీ, మైనస్ 20 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత లను లెక్కచేయకుండా ఆయన తరగతులకు హాజరై శిక్షణ తీసుకుంటున్నారు.  ఓరియంటేషన్ సెషన్‌తో పాటు వివిధ దేశా లకు చెందిన ప్రతినిధులతో కోహార్ట్ పరిచయ కార్యక్రమం లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ప్రపంచవ్యాప్తంగా పరిపాలన, విధాన నిర్ణయాలు, నాయకత్వ రంగాల్లో అనుభవం కలిగిన వారితో కలిసి ఈ శిక్షణలో రేవంత్ భాగ స్వామి కావడం ప్రత్యేకతగా నిలిచింది.

లీడర్‌షిప్ ఇన్ ది ట్వంటీ ఫస్ట్ సెంచరీ పేరుతో నిర్వహి స్తున్న ఈ ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రామ్‌లో తొలి రోజు  అనలైజింగ్ అథారిటీ అండ్ లీడర్‌షిప్ అనే అంశంపై  చర్చ జరిగింది. ఆధునిక పాలన లో అధికార వినియోగం, ప్రజాస్వామ్య విలువలు, నాయకత్వ సవాళ్లపై నిపుణులు క్లాస్ తీసుకున్నారు.  ఒక రెండో రెజైన సోమవారం ( జనవరి 26)  కేస్ స్టడీస్‌పై లోతైన విశ్లేషణ, చిన్న గ్రూపులుగా విభజించి నిర్వహించిన కన్సల్టేటివ్ వర్క్ సెషన్లలో సీఎం రేవంత్ రెడ్డి చురుకుగా పాల్గొ న్నారు. గవర్నెన్స్, పాలసీ అమలు, ప్రజలతో అనుసంధానం వంటి అంశాలపై అనుభవాలను పంచుకుంటూ శిక్షణ తీసుకున్నారు.  ఇదిలా ఉండగా, బోస్టన్, కేంబ్రిడ్జ్ పరిసర ప్రాంతాలు తీవ్ర మంచు తుఫాన్ ప్రభావంతో అతలాకు తలమయ్యాయి.

   భారీ మంచు తుఫాన్ కారణంగా రెండు అడుగు లకుపైగా మంచు కురిసింది. ఉష్ణోగ్రతలు మైనస్ 20 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోవడంతో అక్కడి అధికారులు వింటర్ ఎమర్జెన్సీని ప్రకటించారు. రహదారులు మంచుతో కప్పుకుపోవడంతో అధికారులు అప్రమత్తమై ప్రజలు అత్యవసర ప్రయాణాలు మినహా బయటకు రావొద్దని హెచ్చరికలు జారీ చేశారు. ఈ తీవ్ర వాతావరణ పరిస్థితుల మధ్య కూడా  రేవంత్ రెడ్డి శిక్షణ కార్యక్రమానికి హాజరు కావడం విశేషం. అంతర్జాతీయ స్థాయిలో నాయకత్వ పాఠాలను తెలుసుకుని, వాటిని తెలంగాణ  పాలనలో అమలు చేయా లనే దృక్పథంతో ఈ శిక్షణలో ఆయన పాల్గొంటున్నారు. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu