క‌శ్మీర్‌ లాల్‌చౌక్‌లో తొలిసారి జాతీయ‌జెండా.. ఇప్పుడే నిజ‌మైన స్వాతంత్య్రం..

జమ్మూకశ్మీర్‌లోని శ్రీనగర్‌. పూర్తిగా ముస్లిం ఆధిప‌త్యం ఉన్న ప్రాంతం. వాళ్ల‌లో అధిక సంఖ్యాకులు పాక్ అభిమానులే. మ‌న దేశంలో ఉంటూ జై పాకిస్తాన్ అంటూ నిన‌దించే బ్యాచ్‌. అలాంటి శ్రీన‌గ‌ర్‌లో లాల్‌చౌక్ మ‌రింత డేంజ‌ర‌స్‌. దేశ వ్య‌తిరేక నిర‌స‌న‌లు, ధ‌ర్నాల‌కు సెంట‌ర్ పాయింట్‌. అందుకే, అక్క‌డి ప్ర‌ఖ్యాత ఘంటా ఘ‌ర్ (క్లాక్ ట‌వ‌ర్‌)పై ఎప్పుడూ పాకిస్తాన్ జెండానే ఎగురుతూ ఉండేది. స్వాతంత్రం వ‌చ్చి 75 ఏళ్లు అవుతున్నా.. ఇప్ప‌టికీ అక్క‌డ పాక్ అనుకూల డామినేష‌నే. త్రివ‌ర్ణ‌ప‌తాకం ఎగిరిందేలే. 

అలాంటిది.. 73వ గ‌ణ‌తంత్ర దినోత్స‌వం సంద‌ర్భంగా లాల్‌చౌక్‌లో అపూర్వ‌ ఘట్టం ఆవిష్కృతమైంది. అక్కడి క్లాక్ టవర్‌పై భారతీయ మువ్వ‌న్నెల జెండా రెపరెలాడింది. 73వ రిపబ్లిక్ దినోత్సవం సందర్భంగా పలువురు స్థానికులు ఈ జెండాను ఎగురవేశారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత లాల్‌చౌక్ ఘాంటా ఘర్‌పై జాతీయపతాకం ఎగురవేయడం ఇదే మొదటిసారి అంటే న‌మ్మాల్సిందే.

లాల్‌చౌక్ ప్రాంతంలో ఎన్‌జీవోలు, ప్రభుత్వ యంత్రాంగంతో కలిసి స్థానికులు 73వ రిపబ్లిక్ డే వేడుకలు నిర్వహించారు. ఇద్దరు స్థానిక యువకులు సాజిద్ యూసుఫ్ షా, సహిల్ బషీర్‌లు ఒక క్రేన్‌ సాయంతో క్లాక్ టవర్ పైవరకూ వెళ్లి అక్కడ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. ''స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఇక్కడ పాకిస్థాన్ జెండాలు మత్రమే ఎగిరేవి. శాంతికి భంగం కలిగిస్తూ వచ్చిన పాకిస్థాన్ ప్రేరేపిత వ్యక్తులు ఈ జెండాలు ఎగుర వేసేవారు. 370వ అధికరణ రద్దు తర్వాత ఇక్కడి పరిస్థితుల్లో చాలా మార్పులు వచ్చాయి. నయా కశ్మీర్‌ అంటే ఏమిటని జనం అడుగుతున్నారు? ఇవాళ ఎగురవేసిన త్రివర్ణ పతాకమే నయా కశ్మీర్‌కు అర్ధం చెబుతుంది. ఇదే జమ్మూకశ్మీర్ ప్రజలు కోరుకుంటున్నది కూడా. మాకు పాకిస్థాన్ జెండాలు అక్కర్లేదు. మేము శాంతి, అభివృద్ధిని కోరుకుంటున్నాం'' అని జెండా ఆవిష్కరణ అనంతరం స్థానికుడు ఒకరు తెలిపారు.