గచ్చిబౌలి వద్ద కారు ఢీకొని జింకకు తీవ్రగాయాలు
posted on Jan 3, 2026 7:05PM

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అటవీ ప్రాంతం నుంచి ఓ జింక బయటకు వచ్చింది. గచ్చిబౌలి-లింగంపల్లి పాత ముంబై జాతీయ రహదారిపైకి రావడంతో కారును జింక ఢీకొట్టింది. వెంటనే సమాచారం అందుకున్న హెచ్‌సీయూ యానిమల్ ప్రొటెక్షన్ టీమ్ అక్కడికి చేరుకుంది. అనంతరం, జింకను వన్యప్రాణి సంరక్షణ కేంద్రానికి తరలించారు.
జింక ఆరోగ్య పరిస్థితిపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. అటవీ ప్రాంతాలకు సమీపంగా ఉన్న రహదారుల్లో వాహనదారులు అప్రమత్తంగా ప్రయాణించాలని అధికారులు సూచించారు. సెంట్రల్ యూనివర్సిటీ ఫారెస్ట్ ప్రాంతం నుంచి బయటకు వచ్చిన ఒక జింక రోడ్డుపైకి అకస్మాత్తుగా రావడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో జింకకు గాయాలైనట్లు తెలిసింది.