స్పైసెస్ రుచికోసమేనా.. ORAC అంటే..?

మనం నిత్యం తీసుకునే ఆహారంలో సుగంధద్రవ్యాలకు అత్యంత ప్రాధాన్యత ఉంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కరోనా మహామ్మారి విజృంభిస్తున్న నేపథ్యంతో మరోసారి మన సుగంధద్రవ్యాలలోని ఔషధ విలువల గురించి చర్చ జరుగుతుంది. తక్కువ మోతాదులో వాడే వీటి వల్ల మనం తీసుకునే ఆహారానికి కమ్మని రుచి వస్తుంది. వీటిని రుచికోసమే వాడతామా అంటే కాదనే చెప్పాలి. అంతకుమించిన  వీటిలో ఉన్నది ఎంటో తెలుసుకుందాం..

శరీరంలో రక్తకణాలు ఆక్సిజన్ ను గ్రహిస్తాయి. ఆరోగ్యంగా ఉండాలన్నా.. వ్యాధులకు ఎదుర్కోవాలన్నా ఆక్సిజన్ తగినంతగా శరీరకణాలను అందాలి. అప్పుడే మనలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. మనం తీసుకునే సుగంధ ద్రవ్యాలకు రక్తకణాలు ఎక్కువ ఆక్సిజన్ ను గ్రహించేలా చేయగలిగే శక్తి ఉంది. దీన్నే ఓఆర్ఎసి( ఆక్సిజెన్ రాడికల్ అబ్సోర్బెన్స్ కెపాసిటీ) అని పిలుస్తారు.
మనం రోజూ వాడే పసుపు, తులసి, అల్లం మొదలైన వాటిలో పదిరెట్లు ఓఆర్ఎసి ఉంటుంది. అంతేకాదు ప్రకృతి సిద్దంగా లభించే పండ్లు, కూరగాయలు, గింజలు, మూలికలు ఆక్సిజెన్ గ్రహించే శక్తిని పెంచుతాయి.

కొన్ని సుగంధ ద్రవ్యాలలోని ORAC ....

లవంగం: 314,446 ORAC
దాల్చినచెక్క: 267,537 ORAC
పసుపు: 102,700 ORAC
జీలకర్ర: 76,800 ORAC
తులసి: 67,553 ORAC
అల్లం: 28,811 ORAC
జాజికాయ : 69,640 ORAC
నల్ల మిరియాలు : 34, 053 ORAC

కోవిడ్ 19 వైరస్  నుంచి రక్షణ పొందాలంటే మన శరీరంలోని రోగనిరోధక శక్తినిపెంచుకోవడమే ఏకైకమార్గం. ఓఆర్ఎసి ఎక్కువగా ఉంటే ఆహారం తీసుకోవడం వల్ల మన శరీరా రక్షణ యంత్రాంగానికి కావల్సిన సూక్ష్మపోషకాలైన ఐరన్, జింక్, మెగ్నిషియం, విటమిన్ సి, విటమిన్ డి, ఒమేగా3 వంటి వాటిని శరీరం గ్రహించగలుగుతుంది.
మన ఆయుర్వేదంలోనూ వీటికి అత్యంత ప్రాధాన్యత ఉంది. ఆధునిక యుగంలోనూ మందులు లేని ఎన్నో వ్యాధులను ఇవి నయం చేస్తున్నాయి. ప్రపంచాన్ని వణికించిన ఎన్నో వ్యాధులను అరికట్టడంతోనూ మన భారతీయ ఆయుర్వేద వైద్యం అద్భుతంగా పనిచేస్తుంది అనడానికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. మన సాంప్రదాయ ఆహారంలోనే ఔషధ విలువలు ఉన్నాయి. వాటిని మనం గ్రహించాలి.

భవిష్యత్ లో వచ్చే అనేక రకాల అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాలంటే కంప్యూటర్ లో ఇంటెల్ ప్రాసెసర్  పనిచేసినట్టే మన శరీరంలోనూ రోగనిరోధక శక్తి పనిచేయాల్సిందే.