కవిత ఆరోపణల తర్వాత కేసీఆర్‌తో హరీశ్ రావు భేటీ

 

మాజీ మంత్రి హరీశ్ రావు  లండన్ నుంచి తిరిగివచ్చిన ఆయన ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌తో సమావేశం అయ్యారు. తనపై వచ్చిన ఆరోపణల విషయంలో హరీశ్ రావు, కేసీఆర్‌కు పూర్తి వివరణ ఇచ్చే అవకాశం ఉంది. అయితే, ఈ వివాదంలో బీఆర్ఎస్ పార్టీ అధికారికంగా హరీశ్‌రావుకు మద్దతుగా నిలవడం గమనార్హం. పార్టీ సోషల్ మీడియా ఖాతాల ద్వారా హరీశ్‌రావుకు బాసటగా పోస్టులు పెట్టడంతో ఈ వ్యవహారంలో కేసీఆర్ మద్దతు ఆయనకే ఉందనే ప్రచారం జరుగుతోంది. 


ఈ పరిణామాల మధ్య కేసీఆర్, హరీశ్ రావు భేటీపై సర్వత్ర ఆసక్తి నెలకొంది. ఇప్పటికే కేటీఆర్ కూడా అక్కడే ఉండటంతో ముగ్గురూ సమావేశం అయ్యారు. కవిత ఇటీవల హరీశ్‌రావుతో పాటు ఎంపీ సంతోష్‌రావుపై సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. వారిద్దరూ బీజేపీ, కాంగ్రెస్ పార్టీలతో టచ్‌లో ఉన్నారని, కల్వకుంట్ల కుటుంబాన్ని చీల్చి పార్టీని తమ చేతుల్లోకి తీసుకునేందుకు కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. ఈ కామెంట్స్ పట్లా బీఆర్‌ఎస్ పార్టీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu