Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...స్లిప్ డిస్క్.. ఈ సమస్య మీకు ఉందో లేదో తెలుసుకోండి..!
posted on: Sep 3, 2025 11:26AM

ఈ రోజుల్లో చిన్నవారైనా, పెద్దవారైనా వెన్నునొప్పి, నడుము నొప్పి అనే ఫిర్యాదులు చేయడం చూస్తూనే ఉన్నాం. వెన్నునొప్పి ఏదో ఒక రూపంలో ఇబ్బంది పెడుతుంది. ఈ నొప్పిని తరచుగా నిర్లక్ష్యం చేస్తారు. ఇది క్రమంగా పెరుగుతుంది. ఈ నొప్పి శారీరక అసౌకర్యాన్ని కలిగించడమే కాకుండా, రోజువారీ వనులు చేసుకోవడంలో కూడా ప్రభావితం చేస్తుంది. కానీ ఇలాంటి వెన్ను నొప్పి వెనుక స్లిప్ డిస్క్ లాంటి తీవ్రమైన సమస్య కూడా ఉండవచ్చని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఈ విషయం ఇప్పుడు అందరినీ ఆందోళనకు గురి చేస్తోంది. అసలు స్లిప్ డిస్క్ అంటే ఏమిటి? ఇది వచ్చే అవకాశం ఎవరికి ఎక్కువ ఉంది? దీన్నెలా గుర్తించాలి? పూర్తీగా తెలుసుకుంటే..
స్లిప్ డిస్క్..
స్లిప్డ్ డిస్క్‌ను వైద్య భాషలో 'హెర్నియేటెడ్ డిస్క్' అని కూడా అంటారు. వెన్నెముక ఎముకల మధ్య ఉన్న కుషన్ లాంటి డిస్క్ దాని స్థానం నుండి జారిపోయినప్పుడు ఇది జరుగుతుంది. ఈ డిస్క్ మృదువైన, జెల్లీ లాంటి నిర్మాణం, ఇది ఎముకలు ఒకదానికొకటి రాపిడి కాపాడుతుంది. ఎముకలు సజావుగా కదలడానికి కారణం అవుతుంది. ఈ డిస్క్ పగిలిపోయినప్పుడు లేదా దాని స్థానం నుండి జారిపోయినప్పుడు అది సమీపంలోని నరాలపై ఒత్తిడి తెస్తుంది, దీని కారణంగా నడుము నుండి పాదాల వరకు తీవ్రమైన నొప్పి, తిమ్మిరి, బలహీనత వంటి సమస్యలు వస్తాయి.
కారణాలు..
డిస్క్ జారిపోవడానికి అనేక కారణాలు ఉంటాయి. వీటిలో కొన్ని రోజువారీ అలవాట్లకు సంబంధించినవి, అతి పెద్ద కారణం కూర్చోవడం లేదా తప్పు మార్గంలో వంగడం. దీనితో పాటు బరువైన వస్తువులను, ముఖ్యంగా తప్పు మార్గంలో ఎత్తడం వల్ల, డిస్క్ పై అదనపు ఒత్తిడి పడుతుంది. వయస్సు పెరగడం కూడా ఒక ముఖ్యమైన కారణం. ఎందుకంటే వయస్సుతో డిస్క్ బలం తగ్గడం ప్రారంభమవుతుంది. ఊబకాయం, వ్యాయామం లేకపోవడం, కొన్నిసార్లు ఆకస్మిక గాయాలు కూడా డిస్క్ జారిపోవడానికి కారణం అవుతాయి.
స్లిప్ డిస్క్ సంకేతాలు..
నడుము, వెన్నునొప్పి స్లిప్ డిస్క్ కు సంబంధించినదా కాదా అని తెలుసుకోవడానికి సరైన లక్షణాలను గుర్తించాలి. అత్యంత సాధారణ లక్షణం ఎప్పుడూ తీవ్రమైన నొప్పి కలిగి ఉండటం. ఇది నడుము నుండి ప్రారంభమై కాళ్ళ వరకు వెళుతుంది. దీనిని సయాటికా అని కూడా అంటారు. దీనితో పాటు, చాలా మందికి కండరాలలో తిమ్మిరి, జలదరింపు లేదా బలహీనత కూడా అనిపించవచ్చు. అలాగే, కూర్చోవడం, నిలబడటం లేదా నడవడంలో ఇబ్బంది ఉన్నా, లక్షణాలు ఎక్కువసేపు కొనసాగినా వైద్యుని వద్దకు వెళ్లడం మంచిది.
స్లిప్ డిస్క్ ఎవరికి వచ్చే ప్రమాదం ఉంటుంది?
శారీరక శ్రమలకు తక్కువ ప్రాముఖ్యత ఇచ్చే లేదా గంటల తరబడి ఒకే స్థితిలో కూర్చునే ఐటీ నిపుణులు, డ్రైవర్లు, కార్యాలయ ఉద్యోగులు వంటి వారిలో స్లిప్ డిస్క్ ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా ఈ సమస్య భారీ బరువులు ఎత్తే కార్మికులు లేదా అథ్లెట్లలో కూడా కనిపిస్తుంది.
ముందు జాగ్రత్తలు..
స్లిప్ డిస్క్ రాకుండా ఉండాలంటే దినచర్యలో కొన్ని మార్పులు చేసుకోవడం ముఖ్యం. మొదటగా సరైన పద్ధతిలో కూర్చోవడం అలవాటు చేసుకోవాలి.
కుర్చీపై కూర్చున్నప్పుడు వీపును నిటారుగా ఉంచాలి. ప్రతి 30-40 నిమిషాలకు కాస్త అటు ఇటు నడవాలి.
బరువైన వస్తువులను ఎత్తేటప్పుడు నడుముపై కాకుండా మోకాళ్లపై ఒత్తిడి ఉంచాలి.
క్రమం తప్పకుండా వ్యాయామం, యోగా, స్ట్రెచింగ్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల వెన్నెముక బలోపేతం అవుతుంది.
*రూపశ్రీ.
గమనిక:
ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...






