రక్తపోటుకు చెక్ పెట్టాలంటే ఏం తినాలి?

రక్తపోటు నేటికాలంలో చాలా సాధారణం అయిపోయింది.  ఒకప్పుడు వయసుతో పాటు పెద్దవారికి మాత్రమే రక్తపోటు వచ్చేది.  తరువాత మధ్యవయసు వారిలో రక్తపోటు రావడం మొదలైంది. కానీ ఇప్పట్లో మాత్రం యువతలో ఇంకా చెప్పాలంటే చిన్నపిల్లలలో కూడా రక్తపోటు బయటపడుతూ ఉంటుంది.  సాధారణంగా ఉండాల్సిన దాని కంటే ఎక్కువ రక్తపోటు ఉండటం చాలా ఇబ్బందులకు గురి చేస్తుంది. ముఖ్యంగా అధిక రక్తపోటు కారణంగా గుండెపోటు, స్ట్రోక్ వంటి సమస్యలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది.  ఈ రక్తపోటు నియంత్రణలో ఉండాలంటే పొటాషియం అధికంగా ఉన్న ఆహారాలు తినాలని వైద్యులు చెబుతుంటారు.  అయితే పొటాషియం అధికంగా ఉన్న ఆహారాలు ఏంటి?  ఏ ఆహారాలు తినాలి?  తెలుసుకుంటే..

తినాల్సిన ఆహారాలు..

అరటిపండ్లు..

అరటిపండ్లలో పొటాషియం అధికంగా ఉంటుంది.  సులభంగా లభిస్తాయి, చవకైనవి కూడా. అన్ని రకాల వయసుల వారికి  అనువైనవి. అరటిపండ్లను స్మూతీలు, ఫ్రూట్ సలాడ్లలో కలపడం  లేదా వాటిని నేరుగా  తినడం వల్ల రక్తపోటును నియంత్రణలో ఉంచవచ్చు.

కొబ్బరి నీరు..

కొబ్బరి నీరులో సహజ  ఎలక్ట్రోలైట్లు అధికంగా ఉంటాయి.   ఇందులో పొటాషియం అధికంగా ఉంటుంది.  అటు హైడ్రేట్ గా ఉంచుతూ.. రక్తపోటును అదుపులో ఉంచడానికి సహాయపడుతుంది.

 పాలకూర..

పాలకూరలో  పొటాషియం, ఐరన్ తో పాటు ఇతర ముఖ్యమైన ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. పాలకూరను తీసుకుంటే రక్తపోటును చాలా వరకు నియంత్రణలో ఉంచుకోవచ్చు.

దోసకాయ..

దోసకాయలో పొటాషియం అధికంగా ఉంటుంది.  కేలరీలు తక్కువగా  ఉంటాయి.  పైగా ఇది  హైడ్రేటింగ్ గా ఉంచుతుంది. ఇది రక్తపోటును నియంత్రణలో  ఉంచడానికి సహాయపడుతుంది.

 టమోటాలు..

టమోటాలు  భారతీయ వంటకాల్లో  విరివిగా ఉపయోగిస్తుంటాం. అయితే టమోటాలలో పొటాషియం పుష్కలంగా ఉంటుంది.  టమోటాలను కూరల్లోనే కాకుండా జ్యూస్ కూడా చేసుకుని తాగవచ్చు. ఎక్కువ రక్తపోటు ఉన్నవారికి ఇలా జ్యూస్ చేసుకుని తాగడం మంచి ఉపశమనం  ఇస్తుంది.

పెరుగు..

పెరుగు అద్భుతమైన ప్రోబయోటిక్ మాత్రమే కాదు..  ఇందులో  పొటాషియం కూడా సమృద్దిగా ఉంటుంది. ఇది అధిక రక్తపోటును నియంత్రిస్తుంది.  శరీరానికి పోషణ కూడా ఇస్తుంది.

                                *రూపశ్రీ.

గమనిక:
ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...

Online Jyotish
Tone Academy
KidsOne Telugu