భార్యాభర్తల మధ్య గొడవలు ఎలా ఉండాలి?  ఎలా ఉండకూడదు?

గొడవలు లేని భార్యాభర్తల బంధం అంటూ ఉండదు. వాస్తవానికి భార్యాభర్తల మధ్య  జరిగే గొడవలు చాలా వరకు వారి బంధాన్ని మరింత బలంగా మార్చడంలో సహాయపడతాయి.  భార్యాభర్తల మధ్య జరిగే చిన్న చిన్న గొడవలు  ఒకరి మీద ఒకరికి ఉండే ప్రేమను స్పష్టం చేస్తాయి. అయితే గొడవలు కూడా ఆరోగ్యంగా  ఉన్నప్పుడే భార్యాభర్తల మధ్య బంధం బలపడుతుంది. కానీ నేటి కాలంలో చాలా వరకు భార్యాభర్తల బంధాన్ని విచ్చిన్నం చేసే విదంగా గొడవలు జరగడం చూస్తుంటాం.  అసలు భార్యాభర్తల మధ్య గొడవలు ఎలా ఉండాలి? ఎలా ఉండకూడదు? తెలుసుకుంటే..

భార్యాభర్తల మధ్య వాదనలు, గొడవలు జరుగుతూ ఉంటాయి.  అవన్నీ నిజంగా బంధాన్ని బలపరుస్తున్నాయా లేదా అనే విషయాన్ని గమనించుకోవడం చాలా ముఖ్యం.

భార్యాభర్తల మధ్య గొడవ జరిగినా అది ఆరోగ్యకరంగా ఉండాలి.  భార్యాభర్తలు ఇద్దరూ తమ అబిప్రాయాలను ఓపెన్ గా చెప్పుకోవాలి.  అది వ్యక్తి గౌరవాన్ని దెబ్బతీసేలా కాకుండా సమస్యపై దృష్టి పెట్టేలా ఉండాలి. ఇలా ఉన్నప్పుడు ఇద్దరి మధ్య బంధం విచ్చిన్నం కాకుండా బంధం బలపడుతుంది.

భార్యాభర్తలు ఇద్దరూ వాదించుకున్న తర్వాత జరిగిన విషయం గురించి ఇద్దరూ లోతుగా  ఆలోచించాలి.  ఇది ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది. ప్రతి గొడవ తర్వాత భార్యాభర్తలు తమ భాగస్వాములను మరింత అర్థం చేసుకోగలిగితే,  సమస్య ఎందుకు వచ్చిందనే విషయాన్ని అర్థం చేసుకోగలిగితే ఆ బంధం ఆరోగ్యకరంగా ఉంటుంది.

భార్యాభర్తల మద్య గొడవ ఏదైనా అనుమానం, హింస,  కోపం, నియంత్రించడం,  భయపెట్టడం వంటి విషయాల ద్వారా చోటు చేసుకుంటే అది బార్యాభర్తల మద్య బంధాన్ని నాశనం చేస్తుంది.

భార్యాభర్తల మధ్య  ఎన్ని గొడవలు జరిగినా అది చివరికి పరిష్కారం అవ్వాలి.  అలా ఉన్నప్పుడే ఆ బందం అందంగా, ఆనందంగా ఉంటుంది.  భార్యాభర్తలు కూడా ఇలాంటి గొడవల వల్ల దూరం కాకుండా ఉంటారు.  కానీ గొడవలు నిరంతరం జరుగుతూ పరిష్కారం మాత్రం జరగకపోతే ఆ బంధాలు ఎక్కువ కాలం నిలవవు.

                                 *రూపశ్రీ.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu