అత్తాకోడళ్ల బంధాన్ని బలపరిచే మ్యాజిక్ చిట్కాలివి..!

 


అత్తాకోడలు ఇద్దరూ వేరే ఇంట్లో తమ తల్లిదండ్రుల మధ్య గారాభంగా పెరిగి వివాహం పేరుతో ఒక ఇంటిని చేరే వారు.  అయితే ఏ ఇంట్లో చూసినా అత్తాకోడళ్లు అంటే ఒకానొక శత్రుత్వమే కనిపిస్తుంది, వినిపిస్తుంది.  దీనికి కారణం కేవలం బయట సమాజంలో కాదు.. ఇద్దరు వ్యక్తుల మద్య అభద్రతాభావం.  తమ స్థానం ఎక్కడ బలహీనం అవుతుందో అని అత్తగారు,  తనకు తన మాటకు ఎక్కడ విలువ లేకుండా పోతుందో అని కోడలు ఇద్దరూ తమ తమ పంతాలకు పోవడం వల్ల అత్తాకోడళ్ల మధ్య విభేదాలు వస్తుంటాయి. అయితే కొన్ని మ్యాజిక్ చిట్కాలు ఉన్నాయి. ఈ చిట్కాలు పాటించడం వల్ల అత్తాకోడళ్ల బంధం ఎంతో పదిలంగా,  బలంగా,  సంతోషంగా ఉంటుంది.  ఆ  మ్యాజిక్ చిట్కాలు ఏంటో తెలుసుకుంటే..

నేటి కోడలే రేపటి అత్తగారు, ఇప్పటి అత్తగారు ఒకప్పుడు కోడలు  అనే మాట వినే ఉంటారు. అత్తగారి జీవితంలో అంచనాలు ఉంటాయి,  అనుభవాలు ఉంటాయి. కానీ కోడలి జీవితంలో ఆధునికత,  కలలు,  భవిష్యత్తు గురించి ఆశలు ఉంటాయి.  ఇవి రెండూ విరుద్దంగా అనిపిస్తాయి. అందుకే అత్తాకోడళ్ల మధ్య వ్యతిరేకత తలెత్తుతూ ఉంటుంది.

అంచనాల గురించి ఓపెన్ గా..

కోడలి మీద అత్తకు, అత్త గురించి కోడలికి కొన్ని అంచనాలు ఉంటాయి.  అయితే విషయాన్ని మనసులో పెట్టుకుని ఎదుటి వారు,  వారికి వారే అర్థం చేసుకుని తమకు నచ్చినట్టు ఉండాలని అనుకోవడం పిచ్చితనం. ఇంటి బాధ్యతలు కోడలితో ఏవి పంచుకోవాలని అనుకుంటారో అత్తగారు ఓపెన్ గా చెప్పాలి. అలాగే కోడలు కూడా తన కెరీర్,  ప్రాధాన్యాల గురించి ఓపెన్ గా తన అత్తగారితో చెప్పాలి.  ఎందుకంటే అంచనాలు నెరవేరకపోతే అత్తాకోడళ్ల బంధం దెబ్బతింటుంది. అందుకే ముందే ఇలా ఓపెన్ గా మాట్లాడుకుంటే మంచిది.

ప్రేమతోనే సరిహద్దులు..

అత్తాకోడళ్లు ఒకరి విషయంలో ఒకరు జోక్యం చేసుకోవడం వల్ల చాలా గొడవలు జరుగుతుంటాయి.  చాలా సార్లు అత్తలు తమ ఆధిపత్యం చూపించాలని ప్రయత్నిస్తారు. కానీ అత్తాకోడళ్లు ప్రేమగానే మాట్లాడుకుని తమ సరిహద్దులు విధించుకుంటే చాలా వరకు గొడవలు రాకుండా ఉంటాయి. కానీ ఇద్దరూ ఒకరి విషయాలలో మరొకరు ఎక్కువ జోక్యం చేసుకుంటే పెద్ద గొడవలు జరుగుతాయి.

గతం, అనుభవాలు...

అత్త జీవితంలో అనుభవాలు చాలా ఉంటాయి. అలాగే కోడలి జీవితంలో అనుభవాలు ఉంటాయి. అత్తగారు తాను జీవితంలో ఎదుర్కున్న సమస్యలు, కుటుంబ పరంగా ఎదుర్కున్న కష్టాలు, చేసిన పోరాటాలు కోడలితో చెప్పుకుంటూ ఉండాలి, కోడలు తన చిన్నతనం తను పెరిగిన విధానం,  తన కష్టం,  భవిష్యత్తు గురించి తన ఆశలు చెప్పుకోవాలి. ఇవి ఇద్దరి వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకునేలా చేస్తాయి. అంతేకాదు.. అత్తాకోడళ్లు ఒకే ఇంట్లో ఉంటారు.  ఆ ఇల్లు సంతోషంగా, ఎంతో బాగా అబివృద్ది చెందాలంటే అత్తాకోడళ్లు ఇద్దరూ అవగాహనతో ఉండటం ముఖ్యం.  

నిర్ణయాలు..

అత్తాకోఢల్లు ఇద్దరూ ఒక్కమాట మీద ఉన్నప్పుడు ఆ ఇల్లు ఎంతో సంతోషంగా ఉంటుంది.  అందుకే ఏ విషయం గురించి అయినా ఇద్దరూ కలిసి మాట్లాడుకోవాలి.  కోడలు ఇలాగే ఉండాలనే నియమాలు విధించడం అత్తగారి గొప్పతనం అనిపించుకోదు, అత్తగారు చెప్పే ఏ విషయం గురించైనా ఆలోచించకుండా వ్యతిరేకత చూపడం కోడలి తెలివి అనిపించుకోదు. అత్తాకోడళ్లు ఇద్దరూ మాట్లాడుకుని వారి ఇగో సాటిసిపై అయ్యే దిశగా కాకుండా జీవితం గురించి, ఇంచి అబివృద్ది గురించి ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి.

పొగడ్తలు.. గొప్ప మెడిసిన్..

బంధం ఆరోగ్యంగా ఉండటంలో పొగడ్తలు చాలా గొప్పగా పనిచేస్తాయి.   అత్తగారు ఏదైనా బాగా చేసినప్పుడు కోడలు,  కోడలు ఏదైనా పనిని బాగా చేసినప్పుడు అత్తగారు.. ఒకరిని ఒకరు మెచ్చుకోవడం చేయాలి.  ఇలా మెచ్చుకోవడం ఇద్దరి మద్య బందాన్ని బలంగా మార్చుతుంది. అంతేకాదు.. ఒకరి మంచి అలవాట్లను మరొకరు మెచ్చుకోవడం, ఒకరికి ఒకరు మంచి స్నేహితురాలిగా ఉండటం వల్ల అత్తాకోడళ్ల బందం పదిలంగా ఉంటుంది.

                             *రూపశ్రీ.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu