లవంగాలను నీటిలో మరిగించి తాగితే ఏమవుతుంది?

 

వంటింటి మసాలా దినుసుల్లో లవంగాలు చాలా ముఖ్యమైనవి. లవంగాలను చాలా ఆహార పదార్థాల తయారీలోనూ, మసాలా పొడుల తయారీలోనూ ఉపయోగిస్తారు. రోజుకు ఒక లవంగం నమిలి తినడం చాలా మంచిదని చెబుతుంటారు. అయితే లవంగాలను నీటిలో మరిగించి ఆ నీటిని తాగడం వల్ల ఆరోగ్యానికి ప్రయోజనాలు ఉంటాయని అంటున్నారు. ఇంతకీ.. లవంగాలను నీటిలో మరిగించి తాగితే కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసుకుంటే..

 

లవంగాల నీరు..
ఒక గ్లాసు నీటిలో 4 నుండి 5 లవంగాలు వేసి బాగా మరిగించాలి.  ఈ నీరు గోరు వెచ్చగా అయ్యాక ఆ నీటిని తాగాలి.  ఈ నీరు తాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని అంటున్నారు. ఈ పానీయం శరీరాన్ని వివిధ రకాల ఆరోగ్య సమస్యల నుండి రక్షించడంలో,  ఆరోగ్యాన్ని మెరుగు పరచడంలో సహాయపడుతుంది.

 

ప్రయోజనాలు..
లవంగాలు మరిగించిన నీరు జీర్ణ ఎంజైమ్ ల స్రావాన్ని పెంచుతుంది. ఇది గ్యాస్,  ఆమ్లతత్వం, మలబద్దకం, అజీర్ణం వంటి సమస్యల నుండి తక్షణ ఉపశమనాన్ని ఇస్తుంది.

లవంగాలలో యూజెనాల్ అనే రసాయనం ఉంటుంది. ఇది యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలకు చాలా ప్రసిద్ధి చెందినది.  లవంగాలను మరిగించిన నీరు తాగితే శరీర రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది. దీని వల్ల జలుబు, దగ్గు, వైరల్ ఇన్పెక్షన్ వంటి సమస్యలు తగ్గుతాయి.

లవంగాల నీరు అద్బుతమైన మౌత్ వాష్ గా పనిచేస్తుంది. నోటి దుర్వాసన కలిగించే బ్యాక్చీరియాను  తొలగిస్తుంది. పంటి నొప్పిని తగ్గిస్తుంది, వాచిన చిగుళ్ల నుండి ఉపశమనాన్ని కలిగిస్తుంది.

లవంగాలు మరిగించిన నీరు జీవక్రియను వేగవంతం చేయడం ద్వారా రక్తంలో చక్కెరను నియంత్రించడంలో  సహాయపడుతుంది. అంతేకాదు.. బరువు నిర్వహించడంలో కూడా ఇది సహాయపడుతుంది.

 

- రూపశ్రీ

 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu