బిహార్‌ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల...జూబ్లీ ఉప ఎన్నిక ఎప్పుడంటే?

 

బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైంది. రెండు దశల్లో మొత్తం 243 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్‌ జరుగనుంది. నవంబర్ 6, 11 తేదీల్లో పోలింగ్ నిర్వహించనున్నాట్లు భారత ఎన్నికల సంఘం ప్రకటించింది. నవంబర్ 14న కౌంటింగ్ ఉంటాయని ఈసీఐ జ్ఞానేశ్ కుమార్ తెలిపారు. 

ఈ నెల 13న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల చేస్తారు. నామినేషన్ దాఖలుకు ఈ నెల 21 వరకు గడువు ఉంది. నామినేషన్ల పరిశీలన ఈ నెల 22న చేపట్టనుండగా, నామినేషన్ల ఉపసంహరణ గడువు అక్టోబర్ 24. నవంబర్ 11న పోలింగ్, నవంబర్ 14న ఓట్ల లెక్కింపు ఉంటుంది.

ఏడు రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల్లోని 8 అసెంబ్లీ స్థానాలకు నవంబర్ 11న ఉప ఎన్నికలు జరగనున్నాయి. రాజస్థాన్‌లోని అంతా, ఝార్ఖండ్‌లోని ఘట్‌శిలా, తెలంగాణలోని జూబ్లీహిల్స్‌, పంజాబ్‌లోని తర్న్‌తారన్‌, మిజోరంలోని దంపా, ఒడిశాలోని నౌపాఢాతోపాటు జమ్మూకశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతంలోని బడ్గామ్‌, నగ్రోటా స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతాయని ఎన్నికల కమీషన్ పేర్కొన్నాది