ప్రముఖ హీరోయిన్ కి షాక్ ఇచ్చిన కోర్టు.. 60 కోట్లు డిపాజిట్ చేస్తావా
on Oct 8, 2025

భారతీయ సినీ ప్రేమికులకి పరిచయం అక్కర్లేని పేరు శిల్పాశెట్టి(Shilpa Shetty). హీరోయిన్ గా విభిన్నమైన క్యారెక్టర్స్ ని పోషించి ఎంతో మంది అభిమానుల్ని సంపాదించుకుంది. ఒక బడా వ్యాపార వేత్తని అరవై కోట్ల రూపాయిల మేర మోసం చేసిన కేసులో శిల్పాశెట్టి ఆమె భర్త రాజ్ కుంద్రా(Raj kundra)పై కేసు నమోదయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ కేసు కోర్టు పరిధిలో ఉంది. ముంబై ఆర్ధిక నేరాల విభాగానికి చెందిన పోలీసులు కూడా ఈ కేసులో లుకౌట్ నోటీసులు జారీ చేసారు. దీంతో అనుమతి లేకుండా దేశం దాటి వెళ్ళకూడదు.
శిల్పాశెట్టి, రాజ్ కుంద్రా లు శ్రీలంక దేశం రాజధాని కొలొంబో(Colombo)లో ఒక యూట్యూబ్ ఛానల్ నిర్వహించే కార్యక్రమానికి ఈ నెల 25 , 29 మధ్య హాజరు కావాల్సి ఉంది. దీంతో తమపై లుకౌట్ ఆర్దర్స్ ఉన్న నేపథ్యంలో కొలొంబో వెళ్ళడానికి అనుమతి కోరుతు శిల్పాశెట్టి దంపతులు సంబంధిత కోర్ట్ లో పిటిషన్ దాఖలు చేసారు. తాజాగా కోర్టు ఆ పిటిషన్ ని తిరస్కరించింది. ఒక వేళ దేశం విడిచి వెళ్లాలంటే 60 కోట్ల రూపాయిలు డిపాజిట్ చెయ్యాలని, ఆ తర్వాతే తదుపరి విచారణ కొనసాగుతుందని కూడా కోర్టు తన తీర్పులో స్పష్టం చేసింది.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



