గోదావరి ఉగ్రరూపం.. ధవళేశ్వరం 175 గేట్లు ఎత్తివేత
posted on Jul 25, 2025 3:47PM
.webp)
శాంతి గోదావరి వరద ఉధృతితో మహోగ్రరూపం దాల్చింది. తెలుగు రాష్ట్రాలలో గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు, ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వానల కారణంగా గోదావరికి వరద నీరు పోటెత్తుతోంది. ధవళేశ్వరం వద్ద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో ధవళేశ్వరం బ్యారేజి 175 గేట్లు ఎత్తి దాదాపు 2 లక్షల 16 వేల 300 క్యూసెక్కుల నీటిని సముద్రంలోనికి విడుదల చేస్తున్నారు.
గోదావరికి వరద కారణంగా తూర్పుగోదావరి జిల్లాలోని పలు లంక గ్రామాలు జలమయమయ్యాయి. పలు లంక గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. గోదవరి వరద మరింత పెరిగే అవకాశం ఉందనీ, తోతట్లు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఇలా ఉండగా బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఏపీలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.