యూట్యూబ్ చూసి డైట్...యువకుడు మృతి
posted on Jul 25, 2025 4:08PM

యూట్యూబ్ చూసి డైట్ ఫాలో అయిన యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. తమిళనాడులోని కన్యాకుమారి జిల్లా కొలచెల్‌కు చెందిన శక్తిశ్వరన్ అనే వ్యక్తి యూట్యూబ్‌లో వీడియో చూసి మూడు నెలలుగా ఆహారం తీసుకోకుండా కేవలం నీరు, ఫ్రూట్ జ్యూస్ మాత్రమే తీసుకున్నారు. నిన్న అతడికి ఊపిరాడక మృతి చెందారు. డైట్ ఫాలో కావడం కారణంగానే చనిపోయాడని కుటుంబ సభ్యులు తెలిపారు.
పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.పోలీసుల విచారణలో దిగ్భ్రాంతికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. శక్తిశ్వరన్ ఆహార నియమాలు పాటించే ముందు వైద్యుల సలహాలు, సూచనలు తీసుకోలేదని తల్లిదండ్రులు పోలీసులకు వెల్లడించారు. కేవలం యూట్యూబ్ వీడియోల్లోని సూచనలనే అతను పాటించాడని వారు తెలిపారు.
బరువు తగ్గడానికి వ్యాయామం కూడా చేస్తున్నాడని, కొన్ని మాత్రలు వాడుతున్నాడని తెలిపారు. గురువారం నాడు శక్తిశ్వరన్ ఒక్కసారిగా ఊపిరి ఆడక ఇంట్లో కుప్పకూలిపోయాడు. కుటుంబ సభ్యులు వెంటనే అతనిని ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. అతని మృతికి గల కారణాలు తెలుసుకోవడానికి పోస్టుమార్టం నిమిత్తం తరలించినట్లు పోలీసులు తెలిపారు.