సామాజిక ఉద్యమకారుడు గాదె ఇన్నయ్య అరెస్టు
posted on Dec 21, 2025 12:37PM

మాజీ మావోయిస్టు, సామాజిక ఉద్యమకారుడు గాదె ఇన్నయ్యను ఎన్ఐఏ అధికారులు అరెస్ట్ చేశారు. వరంగల్ జిల్లా జాఫర్‌గఢ్ మండల కేంద్రంలో ఇన్నయ్య నిర్వహిస్తున్న అనాథాశ్రమానికి నాలుగు వాహనాల్లో వచ్చిన ఎన్‌ఐఏ అధికారులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. గత కొంతకాలం మావోయిస్టులకు అనుకూలంగా మీడియాలో ఇంటర్వ్కూలు ఇవ్వడం, ఇటీవల చత్తీస్‌గఢ్‌లో మవోయిస్ట్ అగ్రనేత హిడ్మా స్వగ్రామానికి వెళ్లి రావడం వంటి అంశాలపై విచారిస్తున్నారు.
మవోయిస్ట్ భావజాలాన్ని వ్యాప్తిచేస్తున్నాందున ఉపా చట్టం కింద కేసు నమోదు చేసి గాదే ఇన్నయ్యను అరెస్ట్ చేసి హైదరాబాద్‌కు తరలిస్తున్నారు. ఇటీవల మరణించిన మవోయిస్టు నేత కాతా రామచంద్రారెడ్డి అలియాస్ వికల్ప్ అంత్యక్రియాలకు ఇన్నయ్య హాజరయ్యారు.