సర్పంచ్‌ల ప్రమాణ స్వీకారోత్సవంలో రభస

 

నూతనంగా ఎన్నికైన సర్పంచ్ ల ప్రమాణ స్వీకారోత్సవంలో భాగంగా డీజేలో పెట్టిన పాటకు బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ శ్రేణుల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. వరంగల్ జిల్లా  చెన్నారావుపేట గ్రామపంచాయతీలో నూతనంగా ఎన్నికైన సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం ఏర్పాటు చేశారు. దీంతో బీఆర్ఎస్ పార్టీ బలపరచిన కంది శ్వేత కృష్ణచైతన్య రెడ్డి ఎన్నికైంది. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్ధి ఉప సర్పంచ్ బొంత శ్రీనివాస్ ఎన్నికయ్యారు. 

ప్రమాణ స్వీకారోత్సవంలో భాగంగా బీఆర్ఎస్ పార్టీకి చెందిన వారు డీజేలో పాట పెట్టారు. ఇంతలో కాంగ్రెస్ కార్యకర్త అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో ఇరు వర్గాల మధ్య మాట మాట పెరిగి కుర్చీలతో దాడి చేసుకున్నారు. ఈ దాడిలో కాంగ్రెస్ కార్యకర్త వనపర్తి శోభన్ తలకు గాయమైంది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ఇరువర్గాలను పంపించారు. అనంతరం చెన్నారావుపేట ఎంపీడీవో వెంకట శివానంద్ సర్పంచ్ మిగతా వార్డుల సభ్యులతో ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించి ప్రమాణ చేయించారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu