Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...జగన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు
posted on: Dec 21, 2025 11:50AM
.webp)
వైసీపీ అధినేత ఏపీ మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పుట్టిన రోజు సందర్బంగా సీఎం చంద్రబాబు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయనకు సంపూర్ణ ఆరోగ్యం, సుఖ సంతోషాలు ప్రసాదించాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను’ అని ఎక్స్‌లో పోస్ట్ చేశారు. జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కూడా సామాజిక మాధ్యమాల వేదికగా ఆయనకు బర్త్‌డే విషెస్ తెలిపారు. జగన్‌కు దేవుడు మంచి ఆరోగ్యం, సుఖ సంతోషాలు ఇవ్వాలని దేవుని ప్రార్థిస్తున్నాను’ అని ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
మరోవైపు ఆయన సోదరి, ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కూడా వైఎస్ జగన్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు. అన్నగా సంబోధించకుండా శుభాకాంక్షలు తెలిపారు. “వైసీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు. భగవంతుడు మీకు ఆయురారోగ్యాలు ఇవ్వాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను” అని సందేశంలో పేర్కొన్నారు. కాగా, పవన్, షర్మిల ట్వీట్‌లు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ పార్టీ శ్రేణులు, నేతలు జగన్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహిస్తూ ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.


.webp)



