అమరావతిలో "ఆవకాయ్" ఉత్సవాలు : మంత్రి కందుల
posted on Dec 22, 2025 3:27PM

అమరావతిలో జనవరి 8 నుంచి 10 వరకు ఆవకాయ్ ఉత్సవాలు నిర్వహించనున్నట్లు మంత్రి కందుల దుర్గేశ్ ప్రకటించారు. ఈ వేడుకల్లో తెలుగు సినిమా సాహిత్యం, కవిత్వం, సంగీతం, నృత్యం వంటి కార్యక్రమాలు జరగనున్నాయి. పున్నమి ఘాట్, ద్వీపంలో ఈ ఉత్సవ ఏర్పాట్లు చేయునున్నట్టు తెలిపారు. అంతేకాకుండా వచ్చే ఉగాది నంది అవార్డులు, నంది నాటకోత్సవాలను నిర్వహించాలని ఆలోచిస్తున్నట్టు మంత్రి తెలిపారు. సినీ పరిశ్రమ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని, ఏపీలో షూటింగ్ చేసుకునే సినిమాలకు మరింత ప్రోత్సాహం అందిస్తామని తెలిపారు.
అలాగే ఉగాది నాటికి నంది అవార్డులు, నంది నాటకోత్సవాలు నిర్వహించాలని ప్రభుత్వం ఆలోచిస్తోందని, దీనికి సీఎం చంద్రబాబు కూడా సానుకూలంగా ఉన్నారని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. టాలీవుడ్ ఎదుర్కొంటున్న సమస్యలపై త్వరలో ప్రభుత్వం కీలక సమావేశం నిర్వహించనుందని మూవీ టికెట్ రేట్లు, ఏపీలో షూటింగ్ చేసే సినిమాలు, హై బడ్జెట్ చిత్రాల టికెట్ ధరలపై చర్చించనున్నారు. అధికారుల సమావేశం అనంతరం సినీ ప్రముఖులతో ప్రత్యేక సమావేశం నిర్వహిస్తామని, దానికి సంబంధించిన తేదీలను త్వరలో వెల్లడిస్తామని మంత్రి తెలిపారు.