భరతమాత కాళ్ల వద్దకు తీసుకొచ్చి పడేస్తా… యూట్యూబర్ అన్వేష్ పై ఉక్రెయిన్ మహిళ ఆగ్రహం
posted on Jan 8, 2026 12:07PM

భారత సంప్రదాయాలు, సనాతన ధర్మంపై ఇటీవల సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న వివాదాస్పద వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారు తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇటీవల యూట్యూబర్ అన్వేష్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర విదాదాస్పదమయ్యాయి. హిందువుల మనోభావాలు దెబ్బతినేలా ఆయన చేసిన వ్యాఖ్యలపై ఓ మహిళ మండి పడ్డారు. తనకు అనుమతిస్తే యూట్యూబర్ అన్వేష్ ను భరతమాత కాళ్ల దగ్గరకు తీసుకొచ్చి పడేస్తానంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమంలో తెగ వైరల్ అవుతున్నాయి. ఉక్రెయిన్ మహిళ భారత సంప్రదాయాలు, సనాతన ధర్మానికి మద్దతుగా నిలబడటం విశేషం. ఉక్రెయిన్‌లో జన్మించి ఆంధ్రప్రదేశ్‌కు చెందిన తుమ్మపాల వెంకట్‌ను వివాహమాడిన లిడియా లక్ష్మి ఇక్కడి సంస్కృతి, సంప్రదాయాలు, సనాతన ధర్మాన్ని లోతుగా అధ్యయనం చేశారు.
హిందూ ధర్మం, ఆచారాలు, కుటుంబ వ్యవస్థ తనను ఎంతో ప్రభావితం చేశాయని ఆమె పలు సందర్భాల్లో వెల్లడించారు.భారతీయ సంస్కృతి పట్ల తనకున్న గౌరవాన్ని బహిరంగంగా వ్యక్తం చేస్తూ, సనాతన ధర్మంపై అన్వేష్ చేస్తున్న వ్యాఖ్యలను ఆమె తీవ్రంగా వ్యతిరేకించారు. అవగాహన లేకుండా, కేవలం వ్యూస్ కోసం చేసే వ్యాఖ్యలు భారతదేశ సంస్కృతిని కించపరు స్తున్నాయంటూ అంటూ లిడియా లక్ష్మి యూట్యూబర్ అన్వేష్ పై మండిపడ్డారు. యూట్యూబ్ వేదికగా భారతీయ సంప్రదాయాలు, సనాతన ధర్మంపై అన్వేష్ చేసిన వ్యాఖ్యల పట్ల దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమౌతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో లిడియా లక్ష్మి.. “ఇలాంటి వ్యాఖ్యలు చేసే వారిని వదిలిపెట్టకూడదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రస్తుతం థాయిలాండ్ ఎంబసీలో కాంట్రాక్టర్‌గా పనిచేస్తున్న లిడియా లక్ష్మి, అన్వేష్ మరో దేశానికి పారిపోయే అవకాశం ఉందనీ, అతడిపై సరైన సమయంలో చర్యలు తీసుకోవాలన్నారు. లిడియా లక్ష్మి యూట్యూబర్ అన్వేష్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ విడుదల చేసిన చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. నెటిజనులు ఆమెకు పెద్ద ఎత్తున మద్దతుగా నిలుస్తున్నారు. విదేశీ మహిళ అయినప్పటికీ భారతీయ సంస్కృతి పట్ల ఆమె చూపుతున్న నిబద్ధతకు ఫిదా అవుతున్నారు.
సనాతన ధర్మాన్ని అవమానించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనతో మరోసారి భారతీయ సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణపై పెద్ద చర్చ మొదలైంది. విదేశీయులే సనాతన ధర్మ విలువలను గౌరవిస్తుంటే, దేశంలోనే కొందరు వాటిని కించప రచడం ఎంతవరకు సమంజసం అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే సినీనటి కరాటే కళ్యాణి నా అన్వేషణ యూట్యూబర్ అన్వేష్ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు.