ధవళేశ్వరం వద్ద ఉగ్రగోదావరి.. లంక గ్రామాలకు ముంపు ముప్పు
posted on Aug 31, 2025 12:39PM
.webp)
ధవళేశ్వరం వద్ద వరద గోదావరి ఉధృత ప్రవాహం లంక గ్రామాల ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నది. ఎగువన కురుస్తున్న వర్షాలతో గోదావరి వరద నీటితో పోటెత్తుతున్నది. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద గోదావరి నది ఉగ్రరూపం దాల్చింది. దీంతో అధికారులు బ్యారేజి గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఆదివారం ఉదయం ధవళేశ్వరం బ్యారేజీని 10,92 లక్షల క్యూసెక్కుల నీరు వస్తున్నది. బ్యారేజీ గేట్లు ఎత్తివేసి అధికారులు 10 లక్షల ఒక వేయి 410 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే ధవళేశ్వరం బ్యారేజీ వద్ద మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేసిన అధికారులు లంక గ్రామాల ప్రజలను అప్రమత్తం చేశారు. వరద ఉధృతి పెరిగే అవకాశం ఉండటంతో ముంపు గ్రామాల ప్రజలు, లోతట్టు ప్రాంతాలలో నివసించే వారు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. భద్రాచలం వద్ద కూడా గోదావరి వరద ప్రవాహం తీవ్ర స్థాయిలో ఉండటం, నీటి మట్టం 48 అడుగులు దాటి వూయడంతో అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక కూడా జారీ చేశారు.