ఫ్యాన్ సెట్టింగ్ లో ఈ 5 మార్పులు చేస్తే ఏసీ కూడా పనికిరాదు..!

ఫ్యాన్.. ప్రతి ఇంట్లో చాలా సాధారణంగా ఉండే ఎలక్ట్రిక్ పరికరం.  బయట నుండి ఇంటికి రాగానే ఫ్యాన్ వేసుకుని దాని కింద కూర్చుని రిలాక్స్  అవుతుంటాం. అయితే వేసవి కాలంలో ఫ్యాన్ వేగం తగ్గినట్టు అనిపిస్తుంది. కొన్నిసార్లు ఫ్యాన్ వేసినా అసలు వేయనట్టే అనిపిస్తుంది. అందుకే చాలా మంది ధర ఎక్కువైనా ఏసీ వైపు మొగ్గు చూపుతారు. కానీ ఫ్యాన్ సెట్టింగ్ లో 5 మార్పులు చేయడం వల్ల ఫ్యాన్ స్పీడ్ గా తిరుగుతుంది. దాని వేగం.. అది ఇచ్చే చల్లదనం ముందు ఏసీ కూడా బలాదూర్ అంటున్నారు టెక్నాలజీ నిపుణులు. ఇంతకీ ఆ సెట్టింగ్స్ ఏంటో తెలుసుకుంటే..


కెపాసిటర్..

సీలింగ్ ఫ్యాన్‌లో అమర్చిన కెపాసిటర్ మోటార్‌కు అవసరమైన విద్యుత్‌ను అందించడానికి పనిచేస్తుంది. కెపాసిటర్ల పనితీరు మందగించినట్టైతే  90% కంటే ఎక్కువ సీలింగ్ ఫ్యాన్ సమస్యలు ఎదురవుతాయి. కెపాసిటర్ పని చేయడం ఆపివేసినప్పుడు మోటారుకు విద్యుత్ సరిగా అందదు.  దీంతో ఫ్యాన్ వేగం తగ్గుతుంది.  70 నుండి 80 రూపాయల కెపాసిటర్‌ను తిరిగి అమర్చితే  ఫ్యాన్ వేగం పెరుగుతుంది.  


బ్లేడ్..

కొన్ని సార్లు ఫ్యాన్ బ్లేడ్ వంగడం వల్ల కూడా ఫ్యాన్ వేగం తగ్గుతుంది. అలాంటి పరిస్థితిలో ఫ్యాన్ బ్లేడును మార్చాలి.  దీనివల్ల కూడా సీలింగ్ ఫ్యాన్ వేగం పెరుగుతుంది.


బాల్ బేరింగ్ ఫెయిల్యూర్..


సీలింగ్ ఫ్యాన్లు కాలం గడిచేకొద్దీ వాటిలో బాల్ బేరింగ్స్ లో ధూళి పేరుకుపోతుంది. దీని కారణంగా సీలింగ్ ఫ్యాన్ వేగం తగ్గుతుంది.  దాన్ని మరమ్మత్తు చేయడం ద్వారా ఫ్యాన్ వేగం పెంచవచ్చు.


స్క్రూలు..

ఫ్యాన్ లో స్క్రూలు వదులైతే ఫ్యాన్ వేగాన్ని దెబ్బతీస్తాయి. అందుకే ఫ్యాన్ స్క్రూలు సరిగా ఉన్నాయా లేదా చెక్ చేసుకుంటూ ఉండాలి.


సరళత.

సరళత లేకపోవడం కూడా ఫ్యాన్ వేగాన్ని దెబ్బతీస్తుంది. దీన్ని కూడా రిపేర్ చేయించడం ద్వారా ఫ్యాన్ వేగాన్ని పెంచవచ్చు.

                                               *రూపశ్రీ.