ఫేస్‌బుక్‌ పేరు మారింది.. కొత్త పేరు ఏంటో తెలుసా.?

సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్ పేరు మారబోతుందని రెండు ,మూడు రోజులుగా జరుగుతున్న ప్రచారం నిజమైంది. ఫేస్ బుక్ పేరు మార్పుపై సంస్థ సీఈఓ మార్క్ జుకర్ బర్గ్ అధికారికంగా క్లారిటీ ఇచ్చారు.  ఫేస్‌బుక్ పేరును మెటాగా నామకరణం చేయనున్నట్టు తెలిపారు.ఫేస్‌‌బుక్‌కు చెందిన అన్ని కంపెనీలకు మాతృ సంస్థగా మెటా వర్క్ చేయనుందని పేర్కొన్నారు. అంతే కాకుండా ఫేస్‌బుక్ కింద కొనసాగిన సామాజిక మాధ్యమాలైన ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్‌లు ఇకపై ‘మెటా’ కింద కొనసాగుతాయని సీఈఓ మార్క్ జుకర్ బర్గ్ తెలిపారు. 

జుకర్ బర్గ్ ప్రకటన ప్రకారం మాతృ సంస్థ పేరుమాత్రమే మారింది తప్ప, దాని అనుసంధాన సామాజిక మాధ్యమాల సేవలు పాత పేర్లతోనే కొనసాగుతాయి. ఫేస్‌బుక్ యాజమాన్యం పరిధిలో వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ సోషల్ మీడియా వేదికలు ఉన్నాయి. అయితే గూగుల్ తరహాలో వీటన్నిటికీ ఒక మాతృ సంస్థ ఉండాలని ఫేస్‌బుక్ భావించింది. అందుకే ఫేస్‌బుక్ అనే పేరును మాతృ సంస్థగా ఉంచి, ఇప్పుడున్న ఫేస్‌బుక్ ప్లాట్‌ఫాంకు కొత్త పేరును పెట్టాలని జూకర్‌బర్గ్ నిర్ణయించారు. గూగుల్ సంస్థలకు అల్ఫాబెట్ ఇంక్ అనే మాతృ సంస్థ ఉంది. ఈ మాతృ సంస్థ పరిధిలోనే గూగుల్‌కు సంబంధించిన అన్ని సంస్థలు పని చేస్తాయి. ఇక నుంచి మెటా, వాట్సాప్, ఇన్‌గ్రామ్‌లకు కూడా ఫేస్‌బుక్ మాతృ సంస్థలా ఉండనుంది. 

రెండు నెలలు శ్రమించి కంపెనీ పేరు ‘మెటా’గా మార్చారని తెలిపారు జుకర్ బర్గ్. అలాగే రాబోయే రోజుల్లో ఇది చాలా ప్రభావంతంగా పనిచేయబోతుందని ధీమా వ్యక్తం చేశారు. దీనిని ‘మెటా వర్స్’లో భాగంగా పేరు మార్పు జరిగిందని చెప్పారు. అంతే కాకుండా యాప్‌లో నుండి మరింత సాంకేతిక పరిపక్వత కలిగిన మెటావర్స్ దిశగా అడుగులు వేస్తుందని మార్క్ జుకర్ బర్గ్ స్ప‌ష్టం చేశారు.

డిజిటల్ రియాల్టీ అయిన మెటావర్స్‌కు చిన్నపేరే మెటా. పేరు మార్పు వెనుక ఫేస్‌బుక్‌ భారీ ఫ్యూచర్ ప్లాన్‌ పెట్టుకున్నట్టు తెలుస్తోంది. వచ్చే ఐదేళ్లలో యూరప్ మార్కెట్‌ను శాసించాలని టార్గెట్‌ పెట్టుకుంది. దీంతో పాటు సాధ్యమైనంత త్వరగా మెటావర్స్‌ను బిల్డ్‌ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ మెటావర్స్‌లోనే ఆగ్మెంటెడ్‌ రియాల్టీ, వర్చువల్ రియాల్టీ, ఆన్‌లైన్ గేమింగ్‌ ఉండనున్నాయి. వీటి మీదనే కంపెనీ భవిష్యత్‌ ఆధారపడి ఉందని ఫేస్‌బుక్‌ చెబుతోంది.

దశాబ్ద కాలంగా సోషల్ మీడియా ప్రభావం ప్రపంచ వ్యాప్తంగా విస్తృతమైంది. ప్రపంచంలోని మెజారిటీ ప్రజలు సోషల్ మీడియాను వినియోగిస్తున్నారు. సోషల్ మీడియా ద్వారా ఎన్నో కార్యకలాపాలు జరుగుతున్నాయి. ప్రజల జీవనంలో సోషల్ మీడియా భాగమైంది. అందులో ఫేస్‌బుక్ ప్రధానమైంది. కాగా, ఫేస్‌బుక్ పేరు మార్పు సోషల్ మీడియా విభాగంలోనే కీలక పరిణామంగా నెటిజెన్లు చెప్పుకుంటున్నారు.
 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu