సీఎం జగన్ కు పశువైద్యుల షాక్.. పని చేసేది లేదంటూ వార్నింగ్

అనంతపురం జిల్లాలో పశు వైద్యులు ప్రభుత్వానికి షాకిచ్చారు. ప్రభుత్వం చెబుతున్న ఆ పనులు చేయలేమంటూ బహిరంగంగానే ప్రకటించారు. అంతేకాదు తమను బలవంతం చేస్తే ఊరుకునేది లేదంటూ వార్నింగులు ఇచ్చారు. ఇంతకీ వీళ్లు చేయబోతమని ఖరాకండిగా చెబుతున్న పనులు ఏంటో తెలుసా.. సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకున్న తీసుకొచ్చిన గుజరాత్ పాల డెయిరీ అమూల్ విషయంలోనే. 

ఏపీలో అమూల్ డెయిరీని ప్రోత్సహిస్తోంది జగన్ రెడ్డి సర్కార్. వాళ్లకు విలువైన భూములు, డెయిరీలను కట్టబెట్టడుతూ రైతులంతా ఆ డైయిరీకే పాలు పోసేలా అధికారులతో పనులు చేయిస్తోంది. టీడీపీ అధినేత చంద్రబాబుకు చెందిన హెరిటేజ్ డెయిరీని దెబ్బతీయడమే లక్ష్యంగా అమూల్ ను తీసుకొచ్చారనే ఆరోపణలు ఉన్నాయి.అమూల్ కోసం టార్గెట్ పెట్టీ మరీ పశువైద్యులతో పని చేయిస్తోంది. అయితే ఆ ఆ డెయిరీ కోసం మేమెందుకు ప్రచారం చేయాలంటూ పశు వైద్యులు అనంతపురం జిల్లాలో ఆందోళనకు దిగారు. అమూల్‌ డెయిరీకి పనిచేయిస్తున్నారని వారు ఆరోపించారు. అనంతపురంలో పశువైద్యులు.. ఆ శాఖ జేడీ కార్యాలయం వద్ద తీవ్ర స్థాయిలో ఆందోళన నిర్వహించారు.

అమూల్ సంస్థ.. ఒక్క ఉద్యోగిని కూడా నియమించకుండా, ప్రభుత్వ ఉద్యోగులతో పాలసేకరణ మెంటార్ విధులు అప్పగించిందని పశువైద్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.   పొరుగు జిల్లాల్లో రైతులకు పాల బిల్లులు చెల్లించకుండా ఇబ్బంది పెడుతున్న అమూల్ తీరుతో ఇబ్బంది పడుతున్నారని తెలిపారు.  ఉద్యోగిని కూడా నియమించకుండా, ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులతో పనిచేయిస్తోందని ఆరోపించారు.  పశువైద్యులను మెంటర్లుగా నియమించి అమూల్ కే పాలు పోసేలా.. పాడి రైతులకు అవగాహన కల్పించే బాధ్యతలు అప్పగించారని వైద్యులు మండిపడ్డారు.  పశుసంవర్థకశాఖ జేడీ ఛాంబర్ వద్ద పశువైద్యులు బైఠాయించి నినాదాలు చేశారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu