డేవిడ్ మిల్లర్ రెచ్చిపోవడంతో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ గెలుపు

David Miller steers Kings XI Punjab to an emphatic win over Pune, IPL-6 David Miller, Mandeep Singh   clinch astonishing win for Punjab, KXIP beat Pune by seven wkts in nail-biting finish

 

T20 మ్యాచ్ లోని ఉత్కంఠను మొహాలీలోని పంజాబ్ క్రికెట్ అసోషియేషన్ స్టేడియంలోని ప్రేక్షకులు అనుభవించారు. ఐపిఎల్-6 లీగ్ మ్యాచ్ లో భాగంగా మొదటి టాస్ గెలిచిన కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ పూణే వారియర్స్ ను బ్యాంటింగ్ కు ఆహ్వానించింది. తొలిసారిగా కెప్టెన్సీ పగ్గాలు చేపట్టిన ఆరోన్ ఫించ్ ఓపెనర్ గా బరిలోకి దిగాడు. కింగ్స్ ఎలెవెన్ కెప్టెన్, వికెట్ కీపర్ ఒక పరుగుతో ఉన్నప్పుడు అజహర్ మొహమూద్ బౌలింగ్ లో సునాయసనమైన క్యాచ్ ను జారవిడిచాడు. ఇక అక్కడనుండి వెనుదిరిగి చూడని ఫించ్ 42 బంతుల్లో 64 పరుగులు (8 బౌండరీలు 2 సిక్సర్లు), మరొక ఓపెనర్ రాబిన్ ఊతప్ప 33 బంతుల్లో 37 పరుగులు (4 బౌండరీలు) చేసిన తరువాత పదకొండవ ఓవర్లో బాల్ ని కట్ చేయబోయి ఆవానా బౌలింగ్ లో గిల్ క్రిస్ట్  క్యాచ్ పట్టడంతో వెనుదిరిగాడు. ఫించ్ కు జతకలిసిన యువరాజ్ సింగ్ రావడంతోనే స్కోరు పెంచే ప్రయత్నం చేశాడు. ఫించ్ 42 బంతుల్లో 64 పరుగులు (8 బౌండరీలు 2 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడిన తరువాత గోని బౌలింగ్ లో వోహ్రాకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. స్మిత్ ఫించ్ అవుటయినా యువరాజ్ సింగ్ 24 బంతుల్లో 34 పరుగులు (2 బౌండరీలు 3 సిక్సర్లు) కొట్టిన తరువాత భారీ సిక్సర్ కు ప్రయత్నించి అజహర్ మెహమూద్ బౌలింగ్ లో గురికీరత్ కు క్యాచ్ ఇచ్చి వెనుతిరిగాడు. ఇన్నింగ్స్ చివర్లో మొదటి సారిగా ఈ సీజన్ ఆడుతున్న ల్యూక్ రైట్ 10 34 (6 బౌండరీలు 1 సిక్సర్) విధ్వంసకర బ్యాటింగ్ చేసాడు. మరొక భారీ సిక్సర్ కొట్టబోయి అజహర్ మహమూద్ బౌలింగ్ లో డేవిడ్ హస్సీ కి క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. స్మిత్ 6 పరుగులు, అభిషేక నాయర్ 2 పరుగులు నాటౌట్ గా నిలవడంతో నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 185 పరుగుల భారీ స్కోరు చేసింది. అజహర్ మెహమూద్ కు 2, ఆవానా కు 1, గొనికి 1 వికెట్ దక్కింది. రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ కు మొదట్లోనే ఎదురు దెబ్బ తగిలింది. తొలి ఓవర్లో గిల్ క్రిస్ట్ ను 4 పరుగుల వద్ద భువనేశ్వర్ కుమార్ బౌలింగ్ లో వికెట్ కీపర్ ఊతప్ప క్యాచ్తో, రెండో ఓవర్లో అజహర్ మెహమూద్ 0 పరుగులకు అజంతా మెండీస్ బౌలింగ్ లో ఎల్బీడబ్ల్యూ గా వెనుదిరిగారు. ఓపెనర్ మన్ దీప్ సింగ్ కి తోడుగా వోహ్రా 13 బంతుల్లో 22 పరుగులు (3 బౌండరీలు) ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నంలో వోహ్రా ను యువరాజ్ సింగ్ క్లీన్ బౌల్డ్ చేశాడు. వీరిద్దరూ మూడో వికెట్ కు 18 బంతుల్లో 37 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. 58 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన కింగ్స్ ఎలెవెన్ డేవిడ్ మిల్లర్ క్రీజ్ లోకి రావడంతో రెచ్చిపోయాడు. 4 ఓవర్లలో 45 పరుగులు చేయాల్సిన పరిస్థితికి తెచ్చారు. మన్ దీప్ సింగ్ 58 బంతుల్లో 77 పరుగులు (7 బౌండరీలు) నాటౌట్ గా నిలిచాడు. ఆఖరి ఓవర్లో 16 పరుగులు చేయాల్సి ఉండగా డేవిడ్ మిల్లర్ 41 బంతుల్లో 80 పరుగులు (5 బౌండరీలు 5 సిక్సర్లు) రైట్ బౌలింగ్ లో నాలుగు బంతుల్లో 15 పరుగులు (2 సిక్సర్లు 2 పరుగులు 1 పరుగు రాబట్టాడు. మన్ దీప్ సింగ్ ఒక పరుగు చేశాడు. వీరిద్దరూ కలిసి అజేయంగా నాలోగో వికెట్ కు 128 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఇంకా ఒక బంతి మిగిలి వుండగానే కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ 3 వికెట్లు కోల్పోయి 186 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. యువరాజ్ 1, భువనేశ్వర్ కుమార్ 1, అజంతా మెండీస్ 1 వికెట్ పడగొట్టారు. కీలకమైన తరుణంలో 80 పరుగులు చేసి జట్టుకు విజయాన్ని అందించిన డేవిడ్ మిల్లర్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.